Home రాజకీయాలు విజయమాల్యాతో సంచలన లింకులు

విజయమాల్యాతో సంచలన లింకులు

678
SHARE

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఘాటు ఆరోపణలు చేశారు. ఈసారి చంద్రబాబుతో విజయమాల్యాకు ఉన్న లింకులను బయటపెట్టారు.

చంద్రబాబు విజయమాల్యాను ఎప్పుడు కలిసింది తేదీలతో సహా చెప్పారు విజయసాయిరెడ్డి. 2016 మార్చి 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు లండన్‌ వెళ్లి విజయమాల్యాను కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

మాల్యా దేశం విడిచిపారిపోయిన సరిగ్గా పదిరోజులకే అతడిని చంద్రబాబు ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలన్నారు. 2014 ఎన్నికల్లో మాల్యా నుంచి రూ. 150కోట్ల రూపాయల ఎన్నికల విరాళం తీసుకున్నది నిజం కాదా అని చెప్పారు. వీటిపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.

నాలుగేళ్లుగా ఎన్‌డీఏతో పనిచేసిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్త పార్టనర్‌ను వెతుక్కునేందుకు ఢిల్లీ వస్తున్నారని సాయిరెడ్డి విమర్శించారు. ఏపీలో చంద్రబాబు అక్రమాలను నిలదీస్తున్న వామపక్ష నేతలు… వారి ఢిల్లీ నాయకత్వానికి కూడా చంద్రబాబు గురించి వివరించాలన్నారు విజయసాయిరెడ్డి.

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబుపై రాజ్యసభ చైర్మన్‌ను విజయసాయిరెడ్డి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. దానిపై చైర్మన్ తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అరుణ్‌జైట్లీతో భేటీ అంశాన్ని ఒక ఇంటర్వ్యూలో సుజనా చౌదరి అంగీకరించారని విజయసాయిరెడ్డి చెప్పారు.