Home సినిమా సుమంత్ మూవీ కి వైవిధ్యమైన టైటిల్ ఇదం జగత్

సుమంత్ మూవీ కి వైవిధ్యమైన టైటిల్ ఇదం జగత్

221
SHARE

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్. ఈ ఏడాది మళ్ళీ రావా చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చి కెరియర్ ను సక్సెస్ పంథాలో నడిపించాడు. ఇప్పుడు తాజాగా నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.

సుమంత్ నటిస్తున్న ఈ వైవిధ్యమైన చిత్రానికి ‘ఇదం జగత్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని నిర్ణయించారు. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

త్వరలోనే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలనీ చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.