Home వీడియోలు హాట్ బ్యూటీ కైరా అద్వాని లుక్‌.. దర్శకుడు ఫర్హాన్‌ పాట: మహేష్ బాబు

హాట్ బ్యూటీ కైరా అద్వాని లుక్‌.. దర్శకుడు ఫర్హాన్‌ పాట: మహేష్ బాబు

SHARE

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో కొత్త పోస్టర్లతో సందడి చేస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ లుక్‌ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. మహేష్ తో పాటు కైరా నడిచి వస్తున్న ఈ స్టిల్‌ సూపర్‌ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈసినిమాతో బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వాని టాలీవుడ్ కు పరిచయం అవుతోంది.

ఏప్రిల్‌ 7న భరత్‌ అనే నేను ప్రీ రిలీజ్‌ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమాలోని రెండో పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ పాటను ఆలపించిన బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌కు మహేష్ కృతజ‍్ఞతలు తెలిపతూ ట్విట్టర్లో పోస్ట్ చేసారు.