Home రాజకీయాలు పోతన రామాయణం రాశాడంట.. చంద్రబాబు చెప్పారు వినాలి !

పోతన రామాయణం రాశాడంట.. చంద్రబాబు చెప్పారు వినాలి !

1077
SHARE

బమ్మెర పోతన తెలుగులో మహాభాగవతం వ్రాసాడని అందరికి తెలుసు. అయన తెలుగు మరియు సంస్కృతంలో కూడా భాగవత పురాణాన్ని అనువదించాడు.. సహజ కవిగా కూడా పేరుపొందాడు మరియు భగవతం కొరకు గౌరవించబడ్డాడు.

అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నిర్వచనం చేశారు. గత రాత్రి సీతారామ స్వామి వారి బ్రహ్మోత్సవంకి ఒంటిమిట్ట కోదండరామాలయం కి ముఖ్యమంత్రి హాజరయ్యారు.

అక్కడ చంద్రబాబు ప్రసంగిస్తూ, బమ్మెర పోతన ఇక్కడే రామాయణం వ్రాసి ఈ దేవునికి అంకితం చేసారు అంటూ ప్రసంగం చేసారు. అది విని భక్తులలో కొందరు బిత్తరపోయారు.. చంద్రబాబు చరిత్ర అజ్ఞానాన్నిచూసి నవ్వుకున్నారు.

అంతే కాకుండా ఈ విదంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు “అన్ని విధాలుగా సుఖశాంతులను ఇచ్చింది రామ పరిపాలన .. అందుకే అది ‘రామరాజ్యం’ గా వర్ణించబడింది. అత్యుత్తమ పరిపాలన అందించడానికి నాకు శక్తినివ్వాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను”.

ఈ  సంఘటనకి.. పోతన ఎక్కడ రామాయణం రాశాడండి బాబు అంటూ చాలామంది ప్రజలు టీవీలో మరియు సోషల్ మీడియా మాధ్యమాలలో చూసి నవ్వుతున్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఇవన్నీ షరా మామూలే !!