Home సినిమా రంగస్థలం మూవీ రివ్యూ

రంగస్థలం మూవీ రివ్యూ

SHARE

న‌టీన‌టులు: రామ్ చ‌ర‌ణ్, స‌మంత‌, అన‌సూయ‌, ఆది పినిశెట్టి, ప్ర‌కాశ్ రాజ్, జ‌గ‌ప‌తిబాబు..

నిర్మాత‌లు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి
సంగీతం   : దేవీ శ్రీ ప్ర‌సాద్
ఎడిటింగ్  : న‌వీన్ నూలి
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌కుడు: సుకుమార్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

రంగ‌స్థ‌లం.. ఈ సినిమా కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు ప్రేక్ష‌కులు.

బాహుబలి తర్వాత తెలుగు చిత్రసీమలో విభిన్నమైన చిత్రాల నిర్మాణం ఊపందుకొన్నది. ఆ క్రమంలోనే రంగస్థలం విలక్షణమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధృవ చిత్రం తర్వాత రాంచరణ్, నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో విశేషాలను సొంతం చేసుకొన్నది.

80 దశకం నాటి పరిస్థితులు, కథా నేపథ్యంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో సమంత అక్కినేని, అనసూయ, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, నరేష్ లాంటి నటుల పాత్రలు ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. రంగస్థలం కోసం వేసిన గ్రామం సెట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎన్నో విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

రంగస్థలం కథ..

సిట్టిబాబు(రామ్ చ‌ర‌ణ్) రంగ‌స్థ‌లం ఊరు మ‌నిషి. ఆయ‌న‌కు కాస్త చెవుడు. గ‌ట్టిగా మాట్లాడితే కానీ ఏదీ విన‌బ‌డ‌దు. ఆ ఊళ్లో అంద‌రి పొలాల‌కు నీళ్లు పెడుతుంటాడు సిట్టిబాబు. రంగ‌స్థ‌లం ఊరు ప్రెసిడెంట్ ఫ‌ణీంద్ర భూప‌తి(జ‌గ‌ప‌తిబాబు). ఆయ‌న‌కు ఆ ఊళ్లో తిరుగుండ‌దు.

ఆ ఊరుకు 30 ఏళ్లుగా ఆయ‌నే ప్రెసిడెంట్. ఆయ‌న ఏం చెప్తే అదే వేదం.. ఎదురు తిరిగితే ఉండ‌దు ప్రాణం. అలాంటి ప్రెసిడెంట్ కు సిట్టిబాబు అన్న కుమార్ బాబు(ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. దుబాయ్ నుంచి వ‌చ్చి ఊళ్లో జ‌రుగుతున్న అన్యాయాల‌ను చూసి అడుగుతాడు.

అత‌డికి పోటీగా ప్రెసిడెంట్ గా నామినేష‌న్ వేస్తాడు. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లంలో ప‌రిస్థితుల‌న్నీ మారిపోతాయి. సిట్టిబాబు జీవితం మారిపోతుంది.

సిట్టిబాబు(రామ్ చ‌ర‌ణ్) రంగ‌స్థ‌లం ఊరు మ‌నిషి. ఆయ‌న‌కు కాస్త చెవుడు. గ‌ట్టిగా మాట్లాడితే కానీ ఏదీ విన‌బ‌డ‌దు. ఆ ఊళ్లో అంద‌రి పొలాల‌కు నీళ్లు పెడుతుంటాడు సిట్టిబాబు. రంగ‌స్థ‌లం ఊరు ప్రెసిడెంట్ ఫ‌ణీంద్ర భూప‌తి(జ‌గ‌ప‌తిబాబు). ఆయ‌న‌కు ఆ ఊళ్లో తిరుగుండ‌దు.

ఆ ఊరుకు 30 ఏళ్లుగా ఆయ‌నే ప్రెసిడెంట్. ఆయ‌న ఏం చెప్తే అదే వేదం.. ఎదురు తిరిగితే ఉండ‌దు ప్రాణం. అలాంటి ప్రెసిడెంట్ కు సిట్టిబాబు అన్న కుమార్ బాబు(ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. దుబాయ్ నుంచి వ‌చ్చి ఊళ్లో జ‌రుగుతున్న అన్యాయాల‌ను చూసి అడుగుతాడు.

అత‌డికి పోటీగా ప్రెసిడెంట్ గా నామినేష‌న్ వేస్తాడు. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లంలో ప‌రిస్థితుల‌న్నీ మారిపోతాయి. సిట్టిబాబు జీవితం మారిపోతుంది. అస‌లు ఏం జ‌రుగుతుంది..? ఈ రామ‌ల‌క్ష్మి(స‌మంత‌) ఎవ‌రు..? ర‌ంగ‌మ్మ‌త్త‌(అన‌సూయ‌)తో సిట్టిబాబుతో సంబంధం ఏంటి..? ఇదంతా మిగిలిన క‌థ‌..

అనాలిసిస్

గ్రామ రాజకీయాలకు అద్దంపట్టే విధంగా రూపొందిన స్క్రిప్టు రంగస్థలం. ఎవరికీ అర్థం కానీ కథనంతో ఇబ్బంది పెడతాడన్న అపవాదు సుకుమార్‌ మీద ఉంది. రంగస్థలం.. సుకుమార్ గత చిత్రాలకు పూర్తిగా భిన్నమైన సినిమా. 1980ల నాటి కాలాన్ని వెండితెర మీద రీక్రియేట్‌ చేస్తూ సుక్కు చేసిన ప్రయత్నం సూపర్బ్‌. ప్రతీ ఫ్రేమ్‌లో ఆనాటి పరిస్థితులను తెర మీద చూపించేందుకు చిత్ర యూనిట్ పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. పూర్తిగా ప్రేక్షకులను దాదాపు 40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లడంలో సుకుమార్ టీం సక్సెస్‌ అయ్యింది.

పల్లెటూరి ప్రజల సమస్యలు అక్కడి రాజకీయ పరిస్థితులు, పగలు ప్రతీకారాలతో పాటు మనుషుల్లోని అమాయకత్వం, మంచితనాన్ని కూడా తెర మీద చాలా బాగా ఆవిష్కరించాడు సుకుమార్‌. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్‌ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు. కామెడీతో పాటు యాక్షన్‌, కాస్త రొమాన్స్‌, ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాను తెరకెక్కించాడు. అయితే తను అనుకున్న కథను సుదీర‍్ఘంగా చెప్పిన సుకుమార్‌ అక్కడక్కడా కాస్త విసిగిస్తాడు.

ఇక సినిమాకు మరో ప్రధాన బలం దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం. 80ల నాటి కథకు తగ్గ బాణీలతో సినిమా రిలీజ్‌కు ముందు అంచనాలు పెంచేశాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలోనూ ఏ మాత్రం కమర్షియల్ వాల్యూస్‌ తగ్గకుండా సూపర్బ్‌ సాంగ్స్‌ తో అలరించాడు. నేపథ్య సంగీతంతోనూ ఆడియన్స్‌ ను ఫ్లాష్‌ బ్యాక్‌లోకి తీసుకెళ్లాడు దేవీ. తన శైలికి పూర్తి భిన్నంగా ప్రయత్నించిన దేవీ శ్రీ ప్రసాద్‌ ఆకట్టుకున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రఫి సినిమా మూడ్‌ ను క్యారీ చేసింది. కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. 1980ల నాటి కాలాన్ని తెర మీదకు ఆవిష్కరించేందుకు నిర్మాతలు ఖర్చుకు ఏమాత్రం వెనకాడలేదు.

చిట్టిబాబు చితక కొట్టేసాడు !!

రేటింగ్: 3.25