Home రాజకీయాలు శక్తివంతమైన వ్యక్తిగా జగన్‌.. బాబు, కేసీఆర్‌ వెనక్కు..

శక్తివంతమైన వ్యక్తిగా జగన్‌.. బాబు, కేసీఆర్‌ వెనక్కు..

SHARE

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఈ ఏడాది దేశంలో శక్తివంతుల జాబితాను విడుదల చేసింది. జాబితాలో మోడీ నెంబర్‌ వన్‌గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ జగన్‌, చంద్రబాబు, కేసీఆర్‌, వెంకయ్యనాయుడు, పుల్లల గోపిచంద్‌కు స్థానం దక్కింది.

తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే శక్తివంతుల జాబితాలో వైఎస్ జగన్‌ ముందున్నారు. దేశంలోనే శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో జగన్‌ 35స్థానంలో ఉన్నారు. జగన్ తర్వాతి స్థానంలో చంద్రబాబు (36) ఉన్నారు. చంద్రబాబుకు జగన్ ప్రత్యామ్నాయంగా మారారని పత్రిక అభిప్రాయపడింది.

జగన్ పాదయాత్ర టీడీపీని కలవరపాటుకు గురిచేస్తోందని అభిప్రాయపడింది. టీడీపీలో కేవలం ఒక కుల ఆధిపత్యమే ఉందని.. దానికి వ్యతిరేకంగా ఇతర కులాలను జగన్‌ సమీకరిస్తున్నారని వివరించింది. చంద్రబాబుకు 36వ స్థానం దక్కగా… ఏపీ సీఎంకు సొంత రాష్ట్రంలో ఇల్లు లేదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చెప్పింది.

అయితే హైదరాబాద్‌లో మాత్రం పాత ఇంటి స్థానంలో కొత్తింటి నిర్మాణాన్ని పత్రిక ప్రస్తావించింది. కేసీఆర్‌ శక్తివంతుల జాబితాలో 52వ స్థానంలో ఉన్నారు. వాస్తు దోషానికి భయపడి ఏడాది కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లని అంశాన్ని పత్రిక ప్రస్తావించింది. ఉప రాష్ట్ర పతి వెంకయ్యనాయుడికి 58 వస్థానం దక్కింది. మొత్తం మీద జగన్‌ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా టాప్‌లో ఉన్నారు.