Home రాజకీయాలు సాయిరెడ్డి వ్యాఖ్యలకు.. వాసిరెడ్డి పద్మ కామెంట్స్‌కు లింకుందా?

సాయిరెడ్డి వ్యాఖ్యలకు.. వాసిరెడ్డి పద్మ కామెంట్స్‌కు లింకుందా?

838
SHARE

ఇటీవల చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజయసాయిరెడ్డి అదే సమయంలో చంద్రబాబు చుట్టూ ఉన్న నేరస్తుల గురించి ప్రస్తావించారు. వందల మందిని హత్యలు చేయించిన పరిటాల రవి టీడీపీ వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. బెంగళూరులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్న వ్యక్తి ఇప్పుడు మంత్రిగా లేరా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే అయ్యేందుకు సొంత వదినను చంపిన వ్యక్తి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అయితే పరిటాల రవిపై ఆరోపణలకు మంత్రి పరిటాల సునీత స్పందించారు. తన భర్త అలాంటి వారు కాదని చెప్పారు. మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా తనకు బెంగళూరులో పేకాట క్లబ్ లేదని… కేవలం ట్రస్ట్‌ ద్వారా సేవలు చేస్తున్నానని చెప్పారు. కానీ ఎమ్మెల్యే అయ్యేందుకు వదినను చంపిన మంత్రి మాత్రం ఇప్పటికీ స్పందించలేదు.

అయితే కొద్ది రోజుల క్రితం వాసిరెడ్డి పద్మ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. దేవినేని ఉమా ఎమ్మెల్యే అయ్యేందుకు సొంత వదినను తొక్కేసి, గొంతు పిసికేసి రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. హత్యారాజకీయంతోనే రాజకీయ జీవితం మొదలైంది వాస్తవం కాదేమో దేవినేని ఉమా చెప్పాలని ఆమె సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి చెప్పిన మంత్రి… వాసిరెడ్డి పద్మ చెప్పిన మంత్రి ఇద్దరూ ఒక్కటేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.