Home రాజకీయాలు ఉండవల్లి మాట వినకపోతే బాబుకు చరిత్రహీనతే!

ఉండవల్లి మాట వినకపోతే బాబుకు చరిత్రహీనతే!

240
SHARE

నిన్నమొన్నటివరకూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వైకాపా ఒత్తిడికి, ప్రజల ఆగ్రహానికి తలొగ్గి తాజాగా ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్తాను అంటున్నారు చంద్రబాబు. ఈ విషయాలపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్.. తనదైన చురకలు వేస్తూ విలువైన సూచనలు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు.. ఉండవల్లి మాటలు వినైనా ఆ దిశగా ఆలోచిస్తే రాష్ట్రానికి మేలు చేసిన వారవుతారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే…బీజేపీ – చంద్రబాబు కలిపి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని గుర్తుచేస్తూ మొదలెట్టిన ఉండవల్లి… బాబు కొత్తగా సుప్రీం కు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇప్పటికే కేవీపీ రామచంద్రరావు, తాను వేసిన రిట్ పిటీషన్లకు సంబందించి కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని సూచించారు. తాము కేసులో పేర్కొన్న విషయాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవి కాబట్టి… వాటికి సమర్ధింపు, విభేదింపు అవసరం లేకుండా.. వాస్తవాలు మాత్రం చెబుతూ కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని.. అదే పెద్ద మేలని సూచించారు.

“మీకున్న రాజకీయ అనుభవంతో మీపై ఎంత ఇబ్బంది వచ్చినా ఢిల్లీ స్థాయిలో మేనేజ్ చేసుకోగల దిట్ట… ఇక కక్ష సాధింపు విషయాల్లో మీది అందెవేసిన చేయి.. ఎన్టీఆర్ సమయంలో అది సుస్పష్టం అయ్యింది. సరిగ్గా ఇప్పుడు కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పర్సనల్ గా తీసుకుని.. సోమవారానికి ఢిల్లీ వెళ్లి మీకున్న అనుభవంతో టాలెంట్ తో అవిశ్వాసం జరిగేలా చర్యలు తీసుకోవాలి” అని సూచించారు ఉండవల్లి. పొగుడుతున్నారో, తిడుతున్నారో, బాద్యత గుర్తుచేస్తున్నారో తెలియదు కానీ… ఉండవల్లి చెప్పినవి అక్షర సత్యాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఉండవల్లి సూచనలు పాటిస్తే మాత్రం బాబు కచ్చితంగా రాష్ట్రానికి మేలు చేసినవారవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అలా కాకుండా ఇప్పటికీ అమరావతిలో కూర్చునే మాట్లాడతాం.. టెలీ కాన్ఫరెన్స్ లో సూచనలు చేస్తా అంటే బాబుకున్న 40ఏళ్ల అనుభవం బూడిదలో పోసిన పన్నీరుతో సమానంగా మిగిలిపోవడమే కాకుండా… ప్రత్యేక హోదా విషయంలో బాబు మెతకవైఖరి, బీజేపీకి జంకుతున్న వైనం, హోదా రాకపోవడానికి ప్రధాన కరణం చంద్రబాబే అంటూ వస్తున్న విమర్శలు పూర్తివాస్తవాలనే జనాల నమ్మక మరింత బలపడే అవకాశం ఉంది!