Home సినిమా రంగస్థలం స్క్రీన్‌పై మీకో బిగ్ సర్‌ప్రైజ్

రంగస్థలం స్క్రీన్‌పై మీకో బిగ్ సర్‌ప్రైజ్

96
SHARE

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత ఛాలెంజింగ్ రోల్స్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ ప్రపంచ వ్యాప్తంగా భారీ శుక్రవారం, మార్చి 30 విడుదలకు రెడీ కావడంతో థియేటర్స్ వద్ద సందడి వాతావారణం నెలకొంది. ఈ సందర్భంగా రేపు థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకులకు ‘రంగస్థలం’ చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్‌ను ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఆ సర్‌ప్రైజ్ ఏంటంటే ఇప్పటికే ఈ సినిమా నుండి ఐదు పాటలను రిలీజ్ చేయగా.. రేపు మరోపాటను వెండితెరపై విజువల్‌గా చూపించబోతున్నారట.

ఇప్పటికే రిలీజ్ అయిన ఐదు పాటలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చిన ఐదుపాటలు మ్యూజిక్ లవర్స్‌ని రిపీడ్ మోడ్‌‌లోకి తీసుకువెళ్లాయి. ‘ఎంత సక్కగున్నావే లచ్చిమీ, రంగమ్మా.. మంగమ్మా, రంగ.. రంగ రంగస్థలానా, జిగేల్ రాణి’ లాంటి సాంగ్స్.. మాస్, క్లాస్ ఆడియన్స్‌లో మంచి ఊపుతెస్తున్నాయి. చంద్రబోస్ అందించిన రిలిక్స్ ఈ పాటలకు మరింత బలాన్ని చేకూర్చాయి. కాగా ఈ మూవీలో మరో సాంగ్ ఉందని బిగ్ స్క్రీన్‌పై డైరెక్ట్‌గా చూపిస్తామని దేవి శ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలపడంతో ప్రేక్షకుల్లో ఇక ఆరో పాట ఏ రేంజ్‌లో ఉంటుందోనన్న ఆసక్తి అభిమానుల్లో వ్యక్తమవుతోంది.