Home వీడియోలు బాలయ్య అద్భుతమైన దానవీరశూర కర్ణ.. దుర్యోధనుడు లుక్!

బాలయ్య అద్భుతమైన దానవీరశూర కర్ణ.. దుర్యోధనుడు లుక్!

SHARE

హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్’ చిత్రం షూటింగ్ గురువారం ఉదయం అట్టహాసంగా మొదలైంది. హైదరాబాద్‌ నాచారంలోని రామకృష్ణా హార్టీకల్చరల్‌ సినీ స్టూడియోస్‌లో యన్‌టిఆర్‌ బయోపిక్‌‌ ప్రారంభోత్సవ వేడుకకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నందమూరి నటసింహం బాలకృష్ణ ధరించిన ధుర్కోధనుడి పాత్రపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ క్లాప్ కొట్టిన సీన్‌ను తొలి సన్నివేశంగా చిత్రీకరించారు. గతంలో దానవీరశూర కర్ణ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవంలో జరిగిన సన్నివేశాన్ని ఎన్టీఆర్ బయోపిక్‌కు ఉపయోగించుకోవడం గమనార్హం.

ఎన్టీఆర్ మాదిరిగానే బాలకృష్ణ డైలాగ్స్ చెప్పడంతో సినీ ప్రముఖులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ధుర్యోధనుడి వేషధారణలో ఎన్టీఆర్‌ను గుర్తు తెచ్చారని పలువురు పేర్కొనడం విశేషం. అలాగే దానవీరశూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ చెప్పిన మాదిరిగానే, అవే హావభావాలతో, ఒకే టైమింగ్‌తో బాలకృష్ణ డైలాగ్ చెప్పడం అభిమానులను ఆనందపరిచింది.

బాలకృష్ణ, సాయి కొర్రపతి మరియు విష్ణు వర్ధన్ ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, ఎన్.టి.ఆర్ మాస్ హీరోగా అంచెలంచెలగా ఎదుగుదల, తర్వాత రాజకీయాల్లో ప్రవేశం చూపించబోతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. బాలీవుడ్ ఫేం సంతోష్ తుండియల్ చాయాగ్రహణం అందిస్తున్నారు. డాక్టర్ శ్రీనాద్-ఇందూరి విష్ణువర్ధన్ కలిసి రాసిన కథను దర్శకుడు తేజ టేకప్ చేస్తున్నాడు.