Home రాజకీయాలు అఖిలప్రియ చెంపలు వాయించి ఇంట్లో ….

అఖిలప్రియ చెంపలు వాయించి ఇంట్లో ….

1161
SHARE

ఆళ్లగడ్డ టీడీపీలో వర్గ విబేధాలు చల్లారడం లేదు. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. భూమా వర్థంతి సభలో ఏవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించి భూమా అఖిలప్రియ .. గుంటనక్క అంటూ విమర్శించి హీట్ పెంచారు. ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా భూమా అఖిలప్రియపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలో ఆయనకు సుబ్బారెడ్డి బినామీగా ఉండేవారని చెబుతుంటారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత బినామీ ఆస్తులను సరిగా అప్పగించలేదన్నది అఖిలప్రియ కోపం అని చెబుతుంటున్నారు. ఈ నేపథ్యంలో అవకాశం చిక్కినప్పుడల్లా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా గురువారం ఏవీ హెల్ప్‌ లైన్‌ను సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే అఖిలప్రియపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

భూమా నాగిరెడ్డి బతికి ఉంటే తనను గుంట నక్క అన్న అఖిలప్రియ చెంప చెల్లుమనిపించేవారని చెప్పారు. చెప్పలు వాయించి అఖిలప్రియను ఇంట్లో కూర్చోబెట్టేవాడని వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డి హీరో అయితే తాను డైరెక్టర్‌ను అని చెప్పారు. తెరపై హీరో మాత్రమే కనబడుతుంటారని.. తెర వెనుక వ్యవహారం నడిపే డైరెక్టర్ కనిపించరని… తాను కూడా అలాంటి వాడినేనని చెప్పారు. తనను పిలవకుండా వర్థంతి సభ నిర్వహిస్తే భూమా నాగిరెడ్డి ఆత్మ శాంతిస్తుందా అని ఏవీ ప్రశ్నించారు.

అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి రేసులో తాను కూడా ఉన్నానని సుబ్బారెడ్డి ప్రకటించారు. చంద్రబాబు అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లోఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆళ్లగడ్డలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని కోరారు. మొత్తం మీద ఏవీ సుబ్బారెడ్డి ఇంత బహిరంగంగా మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా గుంపు కట్టడాన్ని చూసి అఖిలప్రియ వర్గం ఆందోళన చెందుతోంది.

ఏవీ సుబ్బారెడ్డి ఏకంగా వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని ప్రకటించే స్థాయికి వచ్చారంటే.. ఆయన వెనుక ఏదో బలమైన శక్తి ఉండిఉంటుందని అఖిలవర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.