Home రాజకీయాలు శభాష్… డ్రామాలాడే బ్యాచ్ కాదిది!

శభాష్… డ్రామాలాడే బ్యాచ్ కాదిది!

SHARE

పోరాడటం అంటే సన్నాయి నొక్కులు నొక్కడం, చేతులు పట్టుకుని పిసకడం, అమరావతిలో ఒకమాట ఢిలీలో ఒక చేత చేయడం, తమకు మూడ్ వచ్చినప్పుడే అంతా కలిసిరావాలనుకోవడం, మేకపోతు గాభీర్యం ప్రదర్శించడం వంటివి కాదు… ఒకడుగు ముందుకేశాక సాధించేవరకూ వెనక్కి తిరిగి చూడకపోవడం. సాధించాల్సిన అంశం గురించి ఎంతదూరమైన ముందుకు వెల్లడం. అవును.. ప్రస్తుతం అదే దిశగా తమ పోరాటంలో ముందుకు దూసుకుపోతున్నారు వైపాకా ఎంపీలు. అధినేత ఒకమాట నేతల మరో చేత వంటివాటికి తావివ్వకుండా… అధినేత ఆదేశాల మేరకు ముందుకు వెల్లే క్రమంలో తాజాగా రాజీనామాస్త్రాలు సంధించేందుకు సిద్దపడ్డారు వైకాపా ఎంపీలు.

సన్నాయినొక్కులు నొక్కే పోరాటం.. మీడియాలో అరుపులు, ఢిల్లీ వెళ్లాక చిలిపి పలుకులు బ్యాచ్ తమది కాదని మరోసారి నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా… ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైకాపా ఎంపీలు రాజీనామా లేఖలతో రెడీ అయ్యారు. పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడిన మరుక్షణమే రాజీనామాలు చేస్తామని రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి.. సంతకాలు చేసిన రాజీనామా లేఖలతో లోక్‌ సభకు బయలుదేరడంపై వారిపై అభినందనల వర్షాలు కురుస్తున్నాయి.

అవిశ్వాసాన్ని తప్పించుకునే క్రమంలో.. ఏఐఏడీఎంకే ఎంపీల నిరసనలను సాకుగా చూపి పార్లమెంట్‌ సమావేశాలను నిరవధికంగా వాయిదావేస్తున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ముందస్తుగా స్పీకర్‌ ఫార్మాట్‌ లో రాజీనామా లేఖలను సిద్ధంచేశారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న వైకాపా ఎంపీలు… రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రస్తుత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, అలాగే ఎన్నికల సమయంలో మోదీ తిరుపతి ప్రచార సభలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి మాట తప్పారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌ ను మోసం చేయడం సరికాదని వైకాపా ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే… సభ సోమవారానికి వాయిదా పడటంతో సహనం వహించిన వైకాపా ఎంపీలు.. ఈ మేరకు అన్నాడీఎంకే నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. ఎవరిని అడ్డుపెట్టుకుని కేంద్రం తప్పించుకు తిరుగుతుందో వారిని ఒప్పించే దిశగా వైకాపా నేతలు మాట్లాడుతున్నారు. గురువారం కావేరి రివర్ బోర్డుకు సంబందించి సుప్రీంలో కీలకమైన తీర్పు వెలువడనున్న తరుణంలో.. కచ్చితంగా సోమవారం వైకాపా పెట్టిన అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉంది! ఏది ఏమైనా బాధ్యత తీసుకుని, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నమ్మకాన్ని వమ్ము చేసుకుని, నేరం తమది కాదు బీజేపీది అంటూ కాలం గడుపుతున్న టీడీపీ చేయాల్సిన పనులు, చేయాల్సిన రాజకీయ ఎత్తుగడలు, ఢిల్లీ స్థాయిలో మంతనాలు వైకాపా చేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.