Home రాజకీయాలు సాయిరెడ్డి ఫైర్.. అలా తోకముడిచిన టీడీపీ!

సాయిరెడ్డి ఫైర్.. అలా తోకముడిచిన టీడీపీ!

SHARE

బురదజల్లడమే పరమావధిగా నెట్టుకొస్తున్నారో ఏమో తెలియదు కానీ.. అసలు విషయాలకంటే కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తూ.. పనికిమాలిన చర్చలకు దారితీస్తున్నారు టీడీపీ నేతలు, ఒక వర్గం మీడియా. తప్పుడు ప్రచారాలు చేయడంలో పి.హెచ్.డి. చేసిన కొన్ని పత్రికలు, ఛానల్లు రసవత్తరమైన డ్రామాకు తెరతీసి బేనర్ ఐటం లు వేసి.. తర్వాత తోకముడుచుకున్న వైనం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

పార్లమెంటు ఆవరణలో అరుణ్ జైట్లీ చేతులు పిసికిన టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల గురించి ఉన్నఫలంగా వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి. ఫైరవ్వండి, కడిగేయండి అని బాబు సూచిస్తే.. వీళ్లేమిటి ఇలా చేతులు నలుపుతున్నారు అని కామెంట్స్ మొదలైపోయాయి. అయితే.. ఈ విషయం హాట్ టాపిక్ గా వైరల్ గా మారుతున్న సమయంలో… ఒక డ్రామాకు, బురదజల్లే కార్యక్రమానికి, తప్పుడు ప్రచారానికి తెరలేపింది పసుపుమీడియా!

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రధాని మోడీ కాళ్లు మొక్కారని! ఈలీకులు ఎవరు ఇచ్చారు, ఎందుకిచ్చారు.. లేనిపోని బురద ఎందుకు చల్లారు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకోండి! ప్రత్యేక హోదా.. అవిశ్వాస తీర్మాణం వంటి ప్రాధాన్య విషయాలను పక్కనపెట్టిన ఎల్లో మీడియా.. ఇదే విషయాన్ని రోజంతా ప్రసారం చేశాయి. అప్పుడే మొదలైంది అసలు కథ.

ఈ విషయాలను గమనించిన విజయసాయిరెడ్డి.. ఒక్కసారిగా నిప్పులు చెరిగారు. తాను చేయని పని చేశారు అని చెప్పడంపై ఉగ్రరూపం దాల్చారు. ఇలాంటి బురదజల్లే కార్యక్రమానికి తెరలేపిన ఎల్లో జానాలపై తనదైన వాగ్భాణాలు సందించారు. సీసీ టీవీ ఫుటేజ్ తెప్పిస్తానని, అది చూపిస్తానని, తాను కాళ్లు మొక్కలేదని ప్రకటించారు. ఈ ఉగ్రరూపానికి హడలిన, బెదిరిన టీడీపీ ఎంపీలు వెంటనే చల్లబడ్డారు.. తోకముడిచారు.. నాలుక మడతపెట్టారు.

విజయ సాయి ప్రధాని కాళ్లు మొక్కారో లేదో తను చూడలేదని, ఎవరో తనతో చెప్పారని తోకముడిచారు సీఎం రమేష్. ఆ సమయంలో తాను విజయసాయి రెడ్డి ని చూడలేదని, తనకు కనిపించలేదని సర్ధుకున్నారు సుజనా చౌదరి. ఈ విషయంపై ఊకదంపుడు ఉపన్యాశాలు చేసిన టీడీపీ ఎంపీలు కూడా… సీఎం రమేష్ చెప్పారని మేము కూడా స్పందించాం తప్ప తమకూ పూర్తిగా తెలియదని జారుకున్నారు. అయినా వెనక్కి తగ్గని సాయిరెడ్డి… సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తాను, తాను కాళ్లు మొక్కలేదని నిరూపిస్తే.. టీడీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్దమా అని ప్రకటించారు. దీంతో.. ఈ విషయంపై కొలుగుల్లో దాక్కున్నారు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా!!