Home రాజకీయాలు బాబుకు ఎన్టీఆర్ ఆత్మ సంధిస్తున్న ప్రశ్నలు!

బాబుకు ఎన్టీఆర్ ఆత్మ సంధిస్తున్న ప్రశ్నలు!

1030
SHARE

చంద్రబాబుకు అసలు అవినీతి అంటే ఏమిటో తెలియదు.. వెన్నుపోటు అనే పదం ఆయన ఎప్పుడూ విని ఉండరు.. భారతీయ సాంప్రదాయాలంటే ఆయనకు ప్రాణం.. పిల్లనిచ్చిన అత్తామామలు అంటే బాబు దృష్టిలో నడిచే దైవాలు.. తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు అంటే దేవుడిచ్చిన వరాలు.. ఇక దళితులు అంటే మరీ ప్రాణం.. నిమ్నవర్గాలంటే బాబుకు ఎనలేని ప్రేమ.. బాబు దృష్టిలో అన్ని సామాజిక వర్గాలు సమానమే.. మహిళలంటే ఉండే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన పాలనలో మహిళలకు ఎంతో రక్షణ ఉంటుంది.. ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గురించి జనాలకు తెలియని విషయాలని అనుకుందాం కాసేపు! అవును… చంద్రబాబుకు ఉన్నఫలంగా తల్లితండ్రులపైనా, భారతీయ సాంప్రదాయాలపైనా ఎనలేని గౌరవం గుర్తుకువచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే… విజయసాయిరెడ్డిపై లేని పోని అబాంఢాలు వేసి బధ్నాం చేయాలని తపించిన అనంతరం.. నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. తప్పుచేయనప్పుడు ఎందుకు తలొగ్గాలి, తగ్గాలి అని భావించిన సాయిరెడ్డి బాబుపై ఫైరయ్యారు. అనంతరం ఆ మాటలపై బాబు స్పందించారు. ఈ సందర్భంగా బాబు ఎత్తుకున్నవి రెండు మాటలు… ఒకటి – తల్లి తండ్రులు ఎవరికైనా తల్లితండ్రులే! రెండు – ప్రధానికాళ్లు మొక్కడం భారతీయ సాంప్రదాయమా?.. ఈ విషయాలపై బాబు తెలిసుకోవాల్సిన సంగతులు చాలానే ఉన్నాయి. సాయిరెడ్డి.. ప్రధాని కాళ్లకు మొక్కలేదని చెబుతున్నా, నిరూపిస్తానని అంటున్నా.. అది భారతీయ సాంప్రదాయామా అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. దీంతో బాబు ప్రధాని కాళ్లు మొక్కిన ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. సమాధానం వచ్చేసింది బాబుకి!!

ఇక రెండో విషయం.. ఎవరి తల్లితండ్రులైనా అందరికీ తల్లితండ్రులే అన్నట్లు!! అవును.. ఈ విషయం బాబుకు ఇప్పుడే గుర్తుకువచ్చిందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. చంద్రబాబు భార్య తల్లి తండ్రులు కూడా బాబుకు తల్లితండ్రులతోనే సమానం కదా! అధికారం కోసం తండ్రి లాంటి నందమూరి తారకరామారావుపై చెప్పులు వేయించినప్పుడు ఏమైంది భారతీయ సాంప్రదాయం? పిలిచి పిల్లనిచ్చి పక్కన కుర్చోబెట్టుకున్న తండ్రి లాంటి మామగారికి వెన్నుపోటు పొడిచినప్పుడు ఏమైంది భారతీయ సాంప్రదాయం? మామగారి భార్య.. అంటే బాబుకు అత్తగారు.. అంటే బాబు దృష్టిలో తల్లి లాంటి లక్ష్మీ పార్వతి పట్ల బాబు వ్యవహరించిన వైఖరి సమయంలో ఏమైందీ భారతీయ సాంప్రదాయం? ఎన్టీఆర్ ఆత్మ సంధించిన ప్రశ్నలు ఇవే! తన పాలనలో జరిగిన కాల్ మనీ వ్యవహారాల్లో ఉన్న మహిళలు కూడా తల్లులే కదా? తమ నేతలు మహిళలపై దాడులు చేసి, చీరలు చింపుతున్నప్పుడు.. ఆ మహిళలు కూడా తల్లులేకదా? ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు ఇవే! సమాధానలు వచ్చేసినట్లేనా?

ఇక్కడ ఆవేశంతోనో, ఆగ్రహంతోనో.. హోదా గురించి ఎంతో పోరాటం చేస్తుంటే.. ఇలాంటి పనికిమాలిన టాపిక్స్ ఎత్తి తనపై బురదజల్లుతున్నారనే బాదతోనో.. విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలగురించి కాదు ఇక్కడ టాపిక్. ఎవరి తల్లి తండ్రులైనా దైవంతో సమానం అని చంద్రబబు లాంటి వ్యక్తి అనడంపైనే డిష్కషన్ అంతా? ఆ సందర్భంలో నుంచి పుట్టిందే… బాబు భార్య తండ్రి కూడా బాబు తండ్రిలాంటి వారేగా, దైవంతో సమానమే కదా అని! అవును.. బాబుకు ఇప్పుడే జ్ఞానోదయం అయ్యి ఉండొచ్చు కదా!! ఎన్టీఆర్ ఇప్పుడు లేరు కాబట్టి సరిపోయింది కానీ… ఆయనే ఉంటే ఈ ప్రశ్నలు బాబుని అడగరా.. అనంతరం కడగరా?