Home రాజకీయాలు సొంత వదినను చంపింది ఎవరు?

సొంత వదినను చంపింది ఎవరు?

2546
SHARE

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ఒక తల్లికి, ఒక తండ్రికి పుట్టిన వారెవరూ చంద్రబాబు లాగా మాట్లాడరని విరుచుకుపడ్డారు. 18 కేసుల్లో స్టేలుచెప్పుకున్న చంద్రబాబు తనను నేరస్తుడంటాడా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అత్యధికులు నేరస్తులేనని ఆయనవిమర్శించారు. వందల మందిని హత్య చేయించిన పరిటాల రవి టీడీపీ నేత కాదా అనిప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవి కోసం సొంత వదినను హత్య చేసిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. రెండేళ్ల జైలు శిక్ష పడ్డ చింతమనేని ఇంకా టీడీపీ ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.

మారిషస్ బ్యాంకులను ముంచిన సుజనా చౌదరికి కేంద్రమంత్రి పదవి ఇప్పించిన ఘనుడు చంద్రబాబు అని అన్నారు. ఈ నేరగాళ్లందరికీ గజనేరగాడైన చంద్రబాబు నాయకుడిగా ఉన్నారన్నారు. చంద్రబాబు ఒక చార్లెస్‌ శోభరాజ్‌ అని అన్నారు.

చంద్రబాబు ఎదురువచ్చినా సరే నమస్కారం పెట్టే సంస్కారం తనకు ఉందన్నారు. అదే తరహాలో ప్రధానికి నమస్కారం పెడితే ఏబీఎన్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఒక కుసంస్కారి అని అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.