Home ట్రైలర్స్ జిగేల్ రాణి వచ్చేసింది

జిగేల్ రాణి వచ్చేసింది

SHARE

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. తన పుట్టిన రోజు సందర్భంగా జిగేల్‌ రాణి  ప్రోమో సాంగ్‌ను రిలీజ్‌ చేశాడు. చరణ్‌ గత సినిమాల్లో లుంగీ కట్టుకుని మాస్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ​, చిరు స్థాయిని మాత్రం అందుకోలేకపోయాడు.

సుకుమార్‌ సినిమాలో ఐటం సాంగ్స్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. సుక్కు మేకింగ్‌, దేవీ మ్యూజిక్‌, విజువైలేజేషన్‌ ఐటం సాంగ్‌ను ఓ లెవల్‌కు తీసుకెళ్తాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో వీడియో సాంగ్స్‌ ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తున్నా…అభిమానులు మాత్రం జిగేల్‌ రాణి ప్రోమో కోసమే ఎదురుచూశారు. చెర్రీ బర్త్‌డే సందర్భంగా…ఈ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. వీడియోలో చెర్రీ స్టెప్పులు, ఎనర్జీ చూస్తే అభిమానులు విజిల్స్‌ వేయాల్సిందే. థియేటర్‌లో ఈ సాంగ్‌కు బాక్స్‌ బద్దలు అవుతాయేమో.

ఈ ప్రోమో సాంగ్‌ను జిగేల్‌ రాణి పూజ హెగ్డే తన ట్విట్టర్ లొ పోస్ట్ చేసారు.. దీనిని మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానన్నారు. మరి మీరు ఒక లుక్  వేసుకోండి !!