Home సినిమా చరణ్ కోసం టైమ్ కేటాయించిన పవన్

చరణ్ కోసం టైమ్ కేటాయించిన పవన్

SHARE

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజును కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. మెగా హీరోలందరూ చరణ్ కు సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ రాజకీయపరమైన పనుల్లో బిజీగా ఉన్నా కూడ వీలు చేసుకుని మరీ అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి అన్న వదినలతో కలిసి చరణ్ తో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కుటుంసభ్యులతో కలిసి లంచ్ చేసి సరదాగా గడిపారు. చరణ్ సతీమణి ఉపాసన దీనికి సంబందించిన ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. చరణ్ నటించిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదలకానుంది.. ఈ చిత్రం కోసం అభిమానులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.