Home రాజకీయాలు చరిత్రహీనులు కాకుండా… బాబుకు జగన్ సూచన!

చరిత్రహీనులు కాకుండా… బాబుకు జగన్ సూచన!

SHARE

ప్రత్యేక హోదా అనే అంశం ఈ రోజువరకూ సజీవంగా ఉందంటే.. ఈ రోజు దేశంమొత్తం ఈ అంశంపై చర్చ నడుస్తుందంటే.. ఈ రోజు పార్లమెంటులో ఈ స్థాయి పోరాటం కొనసాగుతుందంటే అది కచ్చితంగా వైకాపా పోరాట పటిమే అని చెప్పక తప్పదు! ఈ విషయం గ్రహించిన చంద్రబాబు.. వైకాపా ఎంపీలను అనుసరిస్తూ తాము కూడా పోరాడుతున్నాం అని రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే బాబు అండ్ కో చరిత్ర హీనులుగా, ఇంతకాలం రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి, రాష్ట్ర ప్రజలు నష్టపోయిన అన్ని విషయాలకు కారకులుగా మిగిలిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వారికి ఒక అవకాశం ఇస్తున్నారు వైకాపా అధినేత జగన్.

ఈరోజు పార్లమెంటులో జరగబోయే అవిశ్వాస తీర్మానం అనంతరం వైకాపా ఎంపీలంతా రాజీనామాలు చేయాలని జగన్ నిర్ధేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైకాపా నేతలు రాజీనామాలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్న టీడీపీ నేతలు… ఈ విషయంపై వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాబు అండ్ కో ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటం అంతా ఒక డ్రామా అని విమర్శలొస్తున్న నేపథ్యంలో.. ఈ రోజు అవిశ్వాసం అనంతరం వైకాపా ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా తక్షణమే రాజీనామా చేయాలని సూచిస్తున్నారు జగన్.

అమరావతిలో కూర్చుని ప్రెస్ మీట్ లు పెడితేనో, చేతులు కాలాక అఖిలపక్షం డ్రామాలకు తెర తీస్తేనో కలిగే ప్రయోజనం శూన్యం అనే విషయం బాబుకు గుర్తుచేస్తూనే.. పోరాట తీవ్రత కేంద్రంతోపాటు దేశం మొత్తం తెలిసేలా ఎంపీలంతా రాజినామా చేయాలనేది జగన్ వ్యూహంగా ఉంది. ఈ విషయంలో జగన్ చేసిన సూచనను టీడీపీ నేతలు తప్పక పాటిస్తే చరిత్రహీనులు కాకుండా మిగిలే అవకాశాలు కాస్తో కూస్తో ఉంటాయని, అలా కాకుండా ఇంకా బీజేపీతో తెగతెంపులే తప్ప ఇలాంటి పనులు చేయమని కూర్చుంటే మాత్రం టీడీపీని ఎవరూ కాపాడలేరు అనేది పలువురి అభిప్రాయంగా ఉంది.

ఏది ఏమైనా… ప్రత్యేకహోదా విషయంలో పూర్తి నేరస్తుడిగా చంద్రబాబు మిగిలిపోతే.. పోరాట యోధుడిగా జగన్ నిలిచారు అని కామేంట్స్ రావడం కొసమెరుపు!!