Home రాజకీయాలు నిప్పునాదం.. హోల్‌ ఆంధ్రా కనీసం ఈరోజైనా సిగ్గుపడాలి..

నిప్పునాదం.. హోల్‌ ఆంధ్రా కనీసం ఈరోజైనా సిగ్గుపడాలి..

1202
SHARE

ఈ భూమ్మిద పుట్టిన ఏ నేత కూడా చంద్రబాబు అన్ని సార్లు తనను తాను గొప్పొడిగా… నిజాయితీ పరుడిగా, విలువలున్న వ్యక్తిగా, నిప్పుగా పరిచయం చేసుకుని ఉండరేమో!. ఒక వైపు పబ్లిక్‌గా రాజ్యాంగంపై అఘాయిత్వానికి పాల్పడుతూనే తిరిగి విలువలతో బతుకుతున్నా అని చెప్పడం చంద్రబాబుకే సాధ్యమైంది.

తాజాగా ఆదివారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే.. నిప్పుకే కంపరం పుట్టేలా ఉంది. అమిత్‌ షాను విమర్శించే క్రమంలో చంద్రబాబు తన విలువను మరోసారి సొంతంగా చెప్పుకుని తనను తాను పొగుడుకున్నారు. తాను జీవితం మొత్తం విలువకు కట్టుబడే బతుకుతున్నానని.. అందుకే మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ మూడో అభ్యర్థిని గెలుచుకునేందుకు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తక్కువగా ఉన్నప్పటికీ విలువలకు కట్టుబడి మూడో అభ్యర్ధిని నిలబెట్టలేదని చెప్పారు.

చంద్రబాబు వ్యాఖ్యలకు టెలికాన్షరెన్స్‌లో పాల్గొన్న టీడీపీ ఎంపీల అంతరాత్మ ఎలా స్పందించిందో గానీ.. ఏపీ ప్రజలు మాత్రం తాము చంద్రబాబు దృష్టిలో మరీ ఇంత పిచ్చివాళ్లమా అని బాధపడుతున్నారు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని గెలుచుకునేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తక్కువగా ఉన్న విషయం అందరికీ తెలుసు. కానీ అప్పటికే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలు చేసి పచ్చకండువాలను వారి మెడలో వేసి తీసుకొచ్చి టీడీపీ గాటిన కట్టేసుకున్న తర్వాతే మూడో అభ్యర్థి గెలుపుకు ఇద్దరు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారన్న విషయాన్ని చంద్రబాబు కావాలని విస్మరించడమే నిప్పునాదం ప్రత్యేకత.

గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసి… ఆఖరుల్లో తాను నిజాయితీపరుడిని కాబట్టే శతగోపం మాత్రం ముట్టుకోలేదని చెప్పినట్టుగా ఉంది నారా వారి వైఖరి. అయినా ఇంత దిగజారి రాజకీయం చేస్తున్న చంద్రబాబును ఇప్పటికీ గొప్పోడు అని కీర్తిస్తూ ఆయన వద్దే ఉన్నారే ఆ టీడీపీ నేతల గుండెలు మాత్రం ఉక్కు కలికలే.