Home సినిమా బాల‌య్య రెండో మ‌న‌వ‌డిని చూశారా..!

బాల‌య్య రెండో మ‌న‌వ‌డిని చూశారా..!

131
SHARE

నందమూరి బాలకృష్ణ మనవడు పుట్టిన ఆనందాన్ని ‘నేను మరోసారి తాతనయ్యా..’ అంటూ అభిమానులతో పంచుకున్నారు. ఆయన రెండో కూమార్తె తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా తనకు మనవడు పుట్టిన విషయాన్ని అధికారికంగా తెలియజేశారు బాలయ్య. ప్రశాంతంగా నిద్రపోతున్న పాలబుగ్గల పసి మనవడు ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చారు బాలయ్య.

మా బాలయ్య మనవడు ఇడిగో.. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి అంటూ ఈ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం బాలయ్య షేర్ చేసిన తన మనవడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Feeling blessed to be a grandfather once again! I am happy to announce that my second daughter, Tejaswini and my son in…

Posted by Nandamuri Balakrishna on Saturday, March 24, 2018