Home రాజకీయాలు బీజేపీ టార్గెట్.. బాబుని ఏమి చేద్దామని!?

బీజేపీ టార్గెట్.. బాబుని ఏమి చేద్దామని!?

SHARE

ఏమి జరిగిందో తెలియదు.. ఎందుకు విడిపోయి ఈ స్థాయిలో తిట్టుకుంటున్నారో తెలియదు. ప్రత్యేకహోదా గురించి అని టీడీపీ అంటుంది.. మమ్మల్ని దూరం పెట్టాలనే ఉద్దేశ్యమే అని బీజేపీ చెప్పుకుంటుంది!! సరే.. తెరవెనక కారణాల సంగతి కాసేపు పక్కనపెడితే.. ఈ తలాక్ అనంతరం చంద్రబాబు ని బీజేపీ తీవ్రస్థాయిలో టార్గెట్ చేసిందనే కథనాలు వరుసగా వెలువడుతున్నాయి! చేయాల్సిందంతా చేసి, అవినీతి ఆంధ్రగా మార్చి.. ఇప్పుడు నేరం మొత్తం బీజేపీపై వేస్తున్నారు అనేది ఆ పార్టీ నేతల బాదగా అనిపిస్తుందట. ఇప్పుడిప్పుడే ఏపీలో కూడా కాస్త కాషాయం జెండా ఎగరేసుకుంటున్న తరుణంలో.. బాబు ఇలా బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నంపై గుర్రుగా ఉన్నారట. దానికి ప్రతిఫలంగా.. బాబుపై ఒక రేంజ్ లో టార్గెట్ ఫిక్స్ చేయబోతుంది కేంద్రం అని తెలుస్తుంది!!

అసలు అవినీతి అంటే తనకు తెలియదని, నీతి నిజాయితీలే తనకు అన్నవస్త్రాలనే రేంజ్ లే చెప్పుకునే చంద్రబాబుకు.. ఆ విషయంలోనే దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తుందట. అలా అని రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పడం, రుజువు చేయడం పెద్ద విషయం కాదు. ఏపీలో నడుస్తున్న ఏ ప్రాజెక్టు ఫైలును కాస్త నిశితంగా పరిశీలించినా కూడా కేంద్రానికి కావాల్సింది కావాల్సినట్లు దొరికేస్తుంది!! కానీ… కేంద్రానికి కావాల్సింది అది కాదు.. అంతకు మించి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో కేంద్రప్రభుత్వానికి సంబందించిన అధికారుల్లో కొంతమంది ప్రత్యేకంగా ఈ పనిమీదే ఉన్నారట! ఏపీలో అవినీతి ఏ రేంజ్ లో జరుగుతుంది.. దానిలో ప్రత్యక్షంగా బాబు పాత్ర ఎంత.. పరోక్షంగా ఉన్న పాత్ర ఎంత.. లోకేష్ పై తీవ్రస్థాయిలో వస్తున్న అవినీతి ఆరోపణల సంగతేంటి.. ఇలా బాబు ను పూర్తిస్థాయిలో దెబ్బకొట్టే కార్యక్రమానికి బీజేపీ తెరలేపిందని అంటున్నారు!! ఇలా అధికారులు చేపట్టిన పనిలో బాబు బాగోతాలు భారీగా బయపడుతున్నాయట. దీంతో.. రాబోయే ఎన్నికల లోపు ఈ పని పూర్తిచేయాలని.. 2019 ఎన్నికల నాటికి బాబు బాగోతం మొత్తం బయటపెట్టాలని బీజేపీ భావిస్తుందట. అలా కాని పక్షంలో ఏపీలో బీజేపీకి కాంగ్రెస్ కి పట్టిన గతే పడుతుందని భావిస్తున్నారట పెద్దలు.

ఈ విషయాలు తెలిసిన తర్వాతే… కాళ్ల బేర కార్యక్రమానికి తెరలేపిన చంద్రబాబు, సుజనాను అరుణ్ జైట్లీ వద్దకు పంపారని అంటున్నారు. అయితే ఈ విషయంలో మరోసారి బాబుని నమ్మి దెబ్బతినడానికి బీజేపీ సిద్దంగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ బీజేపీ – టీడీపీ రచ్చ.. బాబుని ఎంతవరకూ తీసుకెళ్తుందనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొందనే చెప్పాలి!!