Home రాజకీయాలు అవినీతికి కొత్తపేరు పెట్టిన లోకేష్… ఆన్ లైన్ లో సెటైర్లు!

అవినీతికి కొత్తపేరు పెట్టిన లోకేష్… ఆన్ లైన్ లో సెటైర్లు!

246
SHARE

రాష్ట్రం మొత్తం అవినీతిమయం అయిపోయింది.. అవినీతి విషయంలో దేశంలో నెంబర్ వన్ స్థానం కోసం ఏపీ పోటీపడుతుంది.. తాజా కాగ్ నివేదిక కూడా ఏపీ ప్రభుత్వం పనితీరు గురించి క్లియర్ గా చెప్పింది.. నిన్నటి మిత్రులు బీజేపీ కూడా ఏపీ అవినీతిపై కుండబద్దలు కొట్టి మరీ క్లారిటీ ఇస్తున్నారు.. మరో స్నేహితుడు పవన్ అయితే డైరెక్టుగా లోకేష్ కళాకండాలన్నీ తమవద్ద ఉన్నాయని, అవినీతికి లోకేష్ కేరాఫ్ అడ్రస్ అనేస్థాయిలో కామెంట్స్ చేశారు.. ఐతే వీటన్నింటిపైనా శాసనమండలిలో స్పందించారు ఏపీ మంత్రి నారా లోకేష్! వీటిపై లోకేష్ ఇచ్చిన క్లారిటీపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుంది.

ఇంతభారీ స్థాయిలో అభివృద్ధి జరుగుతున్నప్పుడు, ఎన్నో పనులు చేస్తున్నప్పుడు “చిన్న చిన్న తప్పులు” జరుగుతాయి.. తప్పులు జరగడం లేదు అని తాననడం లేదు… అలాంటి తప్పులు ఏమైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి.. పరిష్కరిస్తాం.. అంతే కానీ మొత్తం అవినీతి మయం అనడం సరైంది కాదు అంటున్నారు లోకేష్. ఏపీలో జరుగుతున్న అవినీతిపై ప్రతిపక్షాల ఆరోపణలు, రాజకీయపార్టీల విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే.. కాగ్ నివేధిక వ్యవహారం తప్పైతే కాదు కదా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీని విమర్శించింది అంటే అవి రాజకీయ విమర్శలు అని కాసేపు సైడ్ చేయొచ్చు కానీ… నిన్నమొన్నటివరకూ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న నేతలు, మాజీ మంత్రులు సైతం లోకేష్ ఫెర్ఫార్మెన్స్ గురించి కథలు కథలుగా చెప్పుతూన వైనం. జనసేన అధినేత విషయానికొస్తే… లోకేష్ పై నిప్పులు చెరిగే రేంజ్ లో అవినీతి ఆరోపణలు చేయడమే కాదు.. వాటికి సంబందించిన ఆధారాలు అన్నీ తనవద్ద ఉన్నాయని చెబుతున్నారు. ఇంతజరుగుతున్నా.. ఇన్ని జరుగుతున్నా కూడా అదంతా అవినీతి కాదు.. కేవలం చిన్న చిన్న తప్పులో పొరపాట్లో అయ్యి ఉంటాయని లోకేష్ చెప్పడం హాస్యాస్పదం కాక మరేమిటి?

సోహల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కొన్ని కామెంట్స్…

అవినీతికి పేరు మార్చితే “పప్పు” అని మార్చాలి కానీ, “తప్పు” అని మార్చడం ఏమిటి?

ఇతరులు చేస్తే అవినీతి… టీడీపీ చేస్తే తప్పులు.. చిన్న చిన్న తప్పులు!!

ప్రస్తుత ఏపీ పరిస్థితులను బట్టి చూస్తుంటే.. లోకేష్ చెప్పింది నిజమే అనిపిస్తుంది.. కాకపోతే ఆ తప్పుల సైజ్ భారీ!

తండ్రి చిన్న చిన్న పొరపాట్లు చేస్తే.. కొడుకు చిన్న చిన్న తపులు చేశారు అంతే… కాకపోతే వాటి విలువే.. ఊహకందనిది!

అవినీతికి, పొరపాటుకూ తేడా తెలియని స్థాయిలో ఉన్నారా జనాలు?

లోకేష్ తెలివి తేటలు… అవినీతికి పేరుమార్చి ఒప్పుకుంటున్నారేమో!