Home సినిమా వైఎస్ఆర్ బయోపిక్: విజయమ్మ, భారతి పాత్రల ఎంపికలో చిత్ర బృందం

వైఎస్ఆర్ బయోపిక్: విజయమ్మ, భారతి పాత్రల ఎంపికలో చిత్ర బృందం

136
SHARE

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మళయాల నటుడు మమ్ముట్టి పోషించనున్నాడు. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ మధ్య రఘువరన్ బీటెక్, 24 సినిమాలో అమ్మగా, అత్తగా ఆకట్టుకున్న శరణ్యను వైఎస్ విజయమ్మ పాత్ర కోసం సంప్రదించినట్టు తెలిసింది. విజయమ్మ పాత్రకు ఆమె సరిగ్గా సూటవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.

అలాగే జగన్ సతీమణి భారతి పాత్రకు కీర్తి సురేష్‌ను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి.. అయితే ఇంకా ఎవరిని సంప్రదించలేదని చిత్ర నిర్మాతలలో ఒకరు అన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ చిత్రం పై  ప్రేక్షకులలో ఆసక్తి.. అంచనాలు పెరుగుతున్న మాట వాస్తవం !!