Home రాజకీయాలు జగన్ యాత్రకు భద్రత ఎత్తేసిన పేట పోలీసులు.. కోడెల కనుసన్నల్లోనే..

జగన్ యాత్రకు భద్రత ఎత్తేసిన పేట పోలీసులు.. కోడెల కనుసన్నల్లోనే..

SHARE

వైఎస్ జగన్‌ పాదయాత్ర నరసరావుపేట నియోజకవర్గంలోకి ఎంటరవుతున్న వేళ ఆయన యాత్రకు పోలీసులు భద్రత ఎత్తివేశారు. కేవలం రోప్ పార్టీ మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్నారు.

సాయంత్రం నరసరావుపేటలో జగన్ బహిరంగసభ ఉందని తెలిసినా పోలీసులు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. నరసరావుపేటకు భారీగా జనం తరలిస్తున్నా కనీసం ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు కూడా చర్యలు తీసుకోలేదు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారు శివరాం ఆదేశాల మేరకే నరసరావుపేట పోలీసులు జగన్ యాత్రకు భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వేలాది మంది నరసరావుపేటకు తరలిరావడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు రావొచ్చని.. కానీ దాన్ని నియంత్రించకుండా పోలీసులు మౌనంగా ఉండడం వెనుక అంతర్యం ఏమిటనిప్రశ్నిస్తున్నారు. నరసరావుపేట పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై వైసీపీ గుంటూరు జిల్లా నేతలు.. డీఎస్పీని, ఎస్పీని కలిసేందుకు వెళ్లారు.

ఒకవేళ పోలీసులు జగన్ సభకు భద్రత కల్పించని పక్షంలో పార్టీ కార్యకర్తలతోనే సభను సజావుగా నిర్వహించేందుకు వైసీపీ నేతలు ఆలోచన చేస్తున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. వైసీపీ సత్తా ఏంటో నరసరావుపేట సభలో చూపించి తీరుతామని వైసీపీ నేతలంటున్నారు.