Home సినిమా మాళవిక శర్మ రామ్ తో జోడీగా చేయనుందా?

మాళవిక శర్మ రామ్ తో జోడీగా చేయనుందా?

107
SHARE

మాళవిక శర్మ ‘నేల టిక్కెట్టు’ సినిమాలో తెలుగులో తొలిసారిగా నటిస్తోంది, ఇందులో మాస్ మహారాజా రవి తేజ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఉగాది సందర్భంగా, మాస్ మహారాజాను ఒక చేతితో ఒక టీ గాజుతో వేసుకొని మరొక చేతితో భంగిమను ఇచ్చే చిత్రం యొక్క మొట్టమొదటి లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.

జనరల్‌గా ఓ సినిమా విడుదలయ్యాకే తర్వాతి సినిమాలకు అవకాశం వస్తుంటుంది. ఏ కొందరి కథానాయికలకో తొలి సినిమా విడుదలవక ముందే తర్వాతి చిత్రాల్లో నటించే చాన్స్‌ వస్తుంది. ఇలాంటి అవకాశమే మాళవిక శర్మని వరించిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

ఆ సినిమా చిత్రీకరణలో ఉండగానే రామ్‌ హీరోగా రూపొందనున్న సినిమాలో కథానాయికగా చాన్స్‌ దక్కించుకున్నారట ఈ బ్యూటీ. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. ‘గరుడవేగ’ వంటి హిట్‌ చిత్రం తర్వాత ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమా చేయనున్నారు.. ఈ చిత్రంలో తొలుత కాజల్‌ అగర్వాల్‌ నటించనున్నారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. తాజాగా మాళవిక శర్మ పేరు తెరపైకి వచ్చింది.