Home రాజకీయాలు వాడబోతున్నారా… ఆలోచించు ప్రిన్స్!!

వాడబోతున్నారా… ఆలోచించు ప్రిన్స్!!

282
SHARE

రాజకీయాలకోసం, అధికారంకోసం, పదవీవ్యామోహంతో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చేస్తున్న రాజకీయాలకు, వ్యూహాలకు, ఎత్తుగడలకు నెక్స్ట్ బలవ్వబోయేది టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు అనే కామెంట్స్ తాజాగా వినిపిస్తున్నాయి. తమ టాలెంట్ ఏమిటో తాము తెలుసుకునేలోపు బాబు వాడకం పూర్తయిపోతుందని ఒక నానుడి. దాన్ని నిజం చేస్తూ 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ ని బాబు వాడారని.. ఆ విషయం పవన్ కి తెలియడానికి నాలుగేళ్లు పట్టిందని పవన్ అభిమానులు చెప్పుకుంటున్న తరుణంలో.. తాజాగా మహేష్ బాబు అభిమానుల టైం వచ్చినట్లుంది.

2014 ఎన్నికల్లో పవన్ ని ఫుల్ గా వాడేసిన బాబు.. పవన్ తాజాగా రివర్స్ అయ్యి టీడీపీ బాగోతం బయటపెడతానని, లోకేష్ అవినీతికి సంబందించి తనవద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్న తరుణంలో… మరో స్టార్ కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని, పథకాలు రచిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బావమరిది.. సూపర్ స్టార్ మహేష్ బాబు ని వాడేయాలని బాబు చూస్తున్నారట. ఈ మేరకు తాజా పరిస్థితులు, సంఘటనలు కాస్త సమాచారం ఇస్తున్నాయి.

మహేష్ బాబు లేటెస్ట్ సినిమా “భరత్ అనే నేను” ఫంక్షన్ ఈ పొలిటికల్ గాసిప్స్ కి వేదికైంది. ముందుగా విశాఖలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చేయాలని భావించారట నిర్మాతలు. అయితే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో… ఆ సినిమా ఫంక్షన్ అమరావతిలో కండక్ట్ చేయాలని భావిస్తున్నారనే లీకులు ఇస్తున్నారు ఆ సినీ జనాలు!! ఇందులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీ రోల్ పోషిస్తున్నారని సమాచారం. పవన్ హ్యాండ్ ఇచ్చిన అనంతరం.. మరో సినిమా హీరో పేరుమీద గట్టెక్కాలని భావిస్తున్నారో ఏమో కాని… ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి టీడీపీ పెద్దలంతా పిలవని పేరంటాల్ల వచ్చి.. మహేష్ తమ పార్టీ అనే పరిస్థితి తమ్ముళ్లు క్రియేట్ చేయబోతున్నారని సమాచారం!

ఈ విషయంలో బాబు పథకాలు ఈ రేంజ్ లోనే ఉంటాయని, మరోసారి సినిమా గ్లామర్ ని వాడుకుని జనాలను మాయచేయాలనేది బాబు ప్లాన్ అనేది పలువురి అభిప్రాయంగా ఉంది. ఈ విషయంలో గల్లా జయదేవ్ అనో, చంద్రబాబు అనో.. వారి వారి పొలిటికల్ మాటలు నమ్మి మచ్చ తెచ్చుకోవడమే కాదు, ఏపీ వాసుల జీవితాలతో మరోసారి మరో సినిమా స్టార్ ఆడుకునే పరిస్థితి కల్పించొద్దని పలువురు మహేష్ కు సూచిస్తున్నారు. అభిమానాల ముసుగులో, అభిమానులను అడ్డుపెట్టుకుని, అభిమానాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రానికి దెబ్బకొట్టొద్దని, జనాల నమ్మకాన్ని, ఇష్టాన్ని ఇలా వాడొద్దని మరికొందరు సూచిస్తున్నారు. మహేష్ ఈ మాట వింటారో పెడచెవినపెడాతారో వేచి చూడాలి!! ఈ విషయంలో ప్రిన్స్ మహేష్ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలని, ఆచి తూచి అడుగులు వేయాలని.. సినిమాని, సినిమా గ్లామర్ ని అడ్డుపెట్టుకుని అసమర్ధులకు సహాయపడి రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని మరికొందరు మహేష్ అభిమానులు అభ్యర్ధిస్తున్నారు!!