Home రాజకీయాలు కుట్రకథ… చిక్కుల్లో శివాజీ…

కుట్రకథ… చిక్కుల్లో శివాజీ…

SHARE

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఆపరేషన్ గరుడాపేరుతో విధ్వంసం జరగబోతోందంటూ వివరించి… ప్రజలను భయాందోళనకు గురిచేసిన నటుడు శివాజీకి చిక్కులు తప్పేలా లేవు. అత్యుత్సాహంతో చాలా సున్నితమైన అంశాన్ని బహిరంగంగా చెప్పి.. ఒకవేళ కుట్రకు సంబంధించిన సమాచారం ఉంటే దానిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించిన శివాజీ ఇప్పుడు దాని ఫలితం అందుకునేలా ఉన్నారు.

శివాజీపై బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు డీజీపీకి లేఖ రాశారు. శివాజీ చెప్పిన ఆపరేషన్ ద్రవిడ వెనుక ఉన్న శక్తులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. శివాజీ చెప్పింది చాలా ఆందోళనకరమైన అంశాలని కాబట్టి విచారణ జరపాలని కోరారు. శివాజీ చెప్పినట్టు కుట్ర వెనుక ఎవరున్నారు.. ఆ విషయం శివాజీకి ఎలా తెలిసింది? తేల్చాలన్నారు. ఈ విషయాలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆపరేషన్ ద్రవిడ పేరుతో కుట్రలు జరుగుతున్నాయని శివాజీ చెప్పారని… ఇందు కోసం రూ. 4వేల 800 కోట్లు కేటాయించారని కూడా శివాజీ వివరించారని లేఖలో గుర్తు చేశారు. కాబట్టి దీనిపై వెంటనే విచారణ చేయాలని డీజీపీని కోరారు. బీజేపీని ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చేందుకు టీడీపీ దర్శకత్వంతో కొన్ని టీవీ చానళ్ల సహకారంతో శివాజీ ఈ కుట్ర కథను సృష్టించినట్టు బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు .