Home రాజకీయాలు సోము వీరంగం.. బాబుకు ఊడదీసేస్తున్నారుగా!

సోము వీరంగం.. బాబుకు ఊడదీసేస్తున్నారుగా!

SHARE

బాబు పాలనలో అవినీతి తీవ్రరూపం దాల్చింది.. లక్షల కోట్ల అవినీతి జరిగింది.. మట్టి నుంచి ఇసుక దాకా, పోలవరం నుంచి పట్టిసీమ దాకా.. ఎక్కడ చూసినా అవినీతే. బాబు పాలనలో జరుగుతున్న అవినీతిని తవ్వడానికి పలుగు పారా సరిపోదు.. ఏకంగా బుల్డోజరే కావాలి.. రాష్ట్రంలో అవినీతిని కట్టడి చేయలేని సీఎం.. జపాన్ తరహా ఉద్యమాలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదం కామ మరేమిటి.. ఏమిటి ఈ కామెంట్స్ అనుకుంటున్నారా? ఈ కామెంట్ చేసింది ప్రతిపక్షమో, మీడియానో కాదు సుమా… స్వయంగా బీజేపీ నేత సోము వీర్రాజు బాబుపై చేసిన వ్యాఖ్యలు. మామూలుగానే చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున లేచే సోము… తాజా తెగదెంపుల తర్వాత ఏమాత్రం ఆగడంలేదు. ఈ రేంజ్ లో సాగుతున్న సోము వీరంగం, ఆధారాలు ఉన్నాయని చెబుతున్న వైనం చూస్తుంటే.. బాబుకు ఉన్నవన్నీ ఊడదీసేస్తున్నట్లుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సోము చేప్పిన విషయాలు, చేసిన విమర్శలు సంచలనంగా మారాయి.

ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరంతో పాటు పట్టిసీమ ప్రాజెక్టులు అవినీతి నిలయాలుగా మారిపోయాయి. ఒక ట్రాక్టర్ మట్టికి రూ.4 లక్షలు తినేస్తున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు అవినీతి ఏ రేంజ్ లో ఉందో. పట్టిసీమ 1125 కోట్ల నుంచి మొదలై 1667 కోట్లకు వెళ్ళింది. 24 పంపులు వేసి 30 పంపులకు లెక్కలు కట్టి చూపారు. మట్టి పేరుతో 67 కోట్లు నొక్కేశారు. స్పీల్ వేలో రూ.1400 కోట్ల ఖర్చు.. పంపు సెట్లకు రూ.340 కోట్ల ఖర్చు.. కెనాల్ కలపడానికి గొట్టాల కోసం రూ.817 కోట్లు.. ఇవన్నీ ఎలా చూసినా అర్ధం పర్ధం లేని లెక్కలు. తెలంగాణ సీఎం కేసీఆర్ తమ సచివాలయం కోసం రూ.150 కోట్లు అంటుంటే.. బాబు మాత్రం రూ.950 కోట్లు అంటున్నారు! అదీ ఇదీ అని తేడా ఏమాత్రం లేదు… ఆఖరికి స్కూల్ ఆడపిల్లల కోసం కట్టిన టాయిలెట్స్ నిర్వహణలో కూడా బాబు అవినీతికి పాల్పడుతున్నారంటే… పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అంటూ సోము వీర్రాజు.. చంద్రబాబు పాలనపై ఫైరయ్యారు!

ఈ రేంజ్ లో ఫైరవుతున్న వీర్రాజు తనవి ఆరోపణలు కాదని, ఆదారాలతో కూడిన వ్యాఖ్యలని చెప్పడం కొసమెరుపు. చంద్రబాబు పాలనపై జరుగుతున్న అవినీతికి సంబందించి తనవద్ద ఆధారాలు ఉన్నాయని, కాగ్ తాజా నివేధిక ఇందుకు ఒక ఉదాహరణ అని చెబుతున్నారు వీర్రాజు. ఇంత చెప్పిన వీర్రాజు… బాబు పాలనలో అవినీతి తవ్వడానికి బుల్డోజర్ కావాలనడం చర్చనీయాంశం అయ్యింది. బాబు పాలనలో అవినీతి ఈ రేంజ్ లో ఉందని బీజేపీ ఢిల్లీ పెద్దలకు తెలియదా.. తెలిసే కాంగా ఉన్నారా.. సోము వీర్రాజుకు తెలిసినంత మోడీకి, అమిత్ షా కి తెలియదా.. అనే ప్రశ్నలు ఈ విమర్శల వెనకే ఉత్పన్నం అవుతున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా బీజేపీ నేతలు మౌనంగా ఉంటే మాత్రం.. వారి భాగస్వామ్యం ఈ అవినీతిలో కూడా ఉందని అనుకోవాలనేది పలువురి అభిప్రాయంగా ఉంది! ఏది ఏమైనా.. సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు మాత్రం బాబుకు ఊడదీస్తున్నారనే కామెంట్స్ కి బలం చేకూరుస్తున్నాయి!!