Home రాజకీయాలు బాబు మళ్లీ కాళ్లబేరానికి వెళ్తున్నారా?

బాబు మళ్లీ కాళ్లబేరానికి వెళ్తున్నారా?

SHARE

చంద్రబాబు బీజేపీతో రాజీపడటానికి ఉత్సాహం చూపిస్తున్నారని, ఏది ఏమైనా ఏదోలాగా రాజీపడాలనే విషయం గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తుంది! తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఢిల్లీ వేదికగా, బాబుపై కాస్త సానుభూతి ఉన్న బీజేపీ లీడర్ల ద్వారా అమిత్ షా తో పరోక్ష మంతనాలు జరిపేందుకు, సంకేతాలు పంపుతున్నారని తెలుస్తుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు చూపిస్తున్నారు విశ్లేషకులు. వాటిలో ఒకటి… ప్రజలదృష్టిలో అగాదానికి పడిపోయిన తర్వాత, బాబును ప్రజలు ఇంక నమ్మరని ఫిక్సయిపోయిన తర్వాత బీజేపీతో తెగదెంపుల వల్ల.. అనుకున్న స్థాయి ప్రయోజనం లేకపోవడం కాగా… రెండోది.. కాగ్ తాజా నివేదిక, ఓటుకు నోటు వ్యవహారం, లోకేష్ పై పవన్ చేసిన అవినీతి ఆరోపణలు అని తెలుస్తుంది!

తాజాగా అసెంబ్లీలో బీజేపీ నేతలు కాగ్ రిపోర్ట్ చూపించి.. టీడీపీని ఫుల్ గా వాయించేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్న మాట పూర్తయ్యే లోపు బీజేపీ నేతలు బాబుపై కాగ్ రిపోర్ట్ చూపించి ఫైరవుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని, లెక్కా పత్రాలు లేవని నిప్పులు చెరుగుతున్నారు. అసెంబ్లీలో పరిస్థితి అలా ఉంటే… బయట సోము వీర్రాజు రూపంలో వెనకా ముందు చూడకుండా విమర్శల వర్షం కురుస్తుంది. ఇదే క్రమంలో బీజేపీ కాస్త ఓటుకు నోటు కేసుపై దృష్టి పెట్టబోతుంది అనే సంకేతాలు వస్తున్నాయి! అవన్నీ చాలవన్నట్లు తాజాగా బాబు పుత్రరత్నం లోకేష్ అవినీతిపై పవన్ ఫైరవడమే కాకుండా.. జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా తనవద్ద ఆధారాలు ఉన్నాయని ప్రకటించడం.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రం సంగతి, రాష్ట్ర ప్రజల సంగతి దేవుడెరుగు.. ముందు తాము చక్కబడాలని బాబు అండ్ కో బావిస్తున్నారట! ఇందులో భాగంగా జనాలు ఏమనుకున్నా పర్లేదు.. నవ్విపోదురు గాక.. అని భావిస్తున్న బాబు.. బీజేపీతో రాజీపడిపోవాలని ఆలోచిస్తున్నారట. ఇప్పుడు హోదాకోసం తెగ పోరాడుతున్నాం అని బిల్డప్ ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సరికదా.. అటు బీజేపీతో శతృత్వ ఫలితం తెచ్చే ప్రమాదం మరీ తీవ్రం! ఎలాగూ భవిష్యత్తు ఫలితాలపై కూడా ఇప్పటికే బాబు అండ్ కో లకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో రాజీపడిపోవడమే బెటరని ఆలోచిస్తున్నారట చంద్రబాబు!! మరి బాబు ఆలోచిస్తున్న ఈ కాళ్లబేరం వ్యవహారం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో వేచి చూడాలి!! ఈ విషయాలు తెలిసిన వారంతా… “బాబు ఎంతకైనా సమర్ధుడు” అని కామెంట్ చేయడం కొసమెరుపు!