Home రాజకీయాలు బాబు ప్లాన్ ప్లాప్… గందరగోళంలో గోపీలు!

బాబు ప్లాన్ ప్లాప్… గందరగోళంలో గోపీలు!

SHARE

ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే పోలీసు కేసు అని మాట్లాడిన బాబు.. గత కొన్ని రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని గళమెత్తిన సంగతి తెలిసిందే. అంతవరకూ బాగానే ఉంది కానీ… ఏకంగా ప్రత్యేక హోదా అనే పోరాటం మొదలుపెట్టింది తానే అనే రేంజ్ లో తాజాగా మాట్లాడుతున్నారు. జనాలు నవ్వుతారనే ఆలోచన ఏమాత్రం చేయని బాబు.. ఈ సాహసానికి ఒడిగట్టారు! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా టీడీపీ, బీజేపీతో తెగదెంపులు చేసుకున్న విషయంపై ఒక చర్చ రాజకీయ వర్గాల్లో సీరియస్ గా నడుస్తుంది. బీజేపీతో ఇంతకాలం సర్ధుకుపోయి సావాసం చేసిన బాబు.. ఉన్నఫలంగా ఎన్నికలు దగ్గరవుతుండగా తీసుకున్న నిర్ణయంపై ఈ తాజా చర్చ ఆసక్తిని కలిగిస్తుంది.

2014సార్వత్రిక ఎన్నికల సమయంలో పొత్తు విషయంలో 15 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో వైకాపా నుంచి గోడదూకి టీడీపీలో చేరిన పలువురు ఎంపీలు స్థానికత అనే సంగతి కాసేపు పక్కనపెట్టి.. ఆ సీట్లు మాకు మిగులుతాయి కదా అనుకుంటున్నారట. కానీ.. బాబు బీజేపీతో కటిఫ్ అనే పని పీకల్ దాకా మునిగాక చేయడంపట్ల మాత్రం గందరగోళంలో పడ్డారని తెలుస్తుంది.

కనీసం రెండు సంవత్సరాల ముందో ఎప్పుడో ఈ నిర్ణయం చంద్రబాబు తీసుకుని ఉంటే… అప్పటికీ టీడీపీ ఇంకా పాతాళానికి పోలేదు కాబట్టి కాస్తో కూస్తో గోపీలంతా కాస్త కష్టపడి నియోజకవర్గాల్లో టీడీపీ జెండాలు పట్టుకుని తిరిగేవారట. అయితే.. అటు గోపీలకు ఇచ్చిన మాటకోసం బీజేపీతో స్నేహం పోవడమే బెటరని ఆలోచించిన బాబు… ఈ కటీఫ్ ప్రత్యేకహోదా కోసం, ప్రజల కోసం అని కలరింగ్ ఇచ్చారు. ఈ కలరింగ్ ఏదో అప్పుడే ఇచ్చి ఉంటే బాగుండేది… ప్రజలదృష్టిలో పాతాళానికి పడిపోయిన పరిస్థితిలో ఉన్న టీడీపీ.. ఇప్పుడు బీజేపీతో ఉంటే ఏమిటి, పోతే ఏమిటి.. ఆ సీట్లలో తాము ఉద్దరించేది ఏమిటి.. అని గోపీలు తెగఫీలయిపోతున్నారట.

పాపం.. గోపీలకోసం బాబు బీజేపీతో కటీఫ్ చెప్పి, ఈ కటీఫ్ ప్రత్యేక హోదా కోసం అని కలరింగ్ ఇచ్చినా కూడా.. గోడదూకి టీడీపీలో చేరిన వారిని మాత్రం అదే గందరగోళంలో ఉంచిందనేది అసలు సమస్య!! ఏది ఏమైనా బాబు ప్లాన్ అత్యంత దారుణంగా ప్లాప్ అవ్వడంతో.. గోపీలు ఇలా గందరగోళంలో పడ్డారట.