Home రాజకీయాలు అమిత్ షా లేఖతో జనాలకు ఈ క్లారిటీ వచ్చింది!

అమిత్ షా లేఖతో జనాలకు ఈ క్లారిటీ వచ్చింది!

SHARE

ఈరోజంతా ఏపీ రాజకీయాలు అమిత్ షా రాసిన 9 పేజీల లేఖ చుట్టూనే తిరిగాయని అనుకోవచ్చు. తాము ఎన్డీఏ నుంచి ఎందుకు వైదొగుతున్నది వివరిస్తూ లేఖ రాసిన చంద్రబాబుకు తనదైన రిప్లై ఇచ్చారు అమిత్ షా! ఈ తొమ్మిది పేజీల లేఖ టీడీపీకి ముచ్చెమటలు పట్టించడమే కాకుండా.. ఇంతకాలం ఏపీలో ఏమి జరిగింది, ఏమి జరగలేదు అనే విషయంపై ప్రజలకు కాస్త క్లారిటీ కూడా వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకూ ఈ లేఖలో బాబుకు షాకింగ్ ఇస్తూ, జనాలకు క్లారిటీ ఇచ్చిన విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం!

అమిత్ షా.. చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్థావించిన అంకెల సంగతి కాసేపు పక్కనపెడితే… రాజకీయంగా బాబును అడ్డంగా ఇరికించిన వ్యాఖ్యలు సంధించారు షా. చంద్రబాబు చేతకానితనాన్ని కేంద్రంపై రుద్దుతున్నారు అనే రేంజ్ లో షా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలని మొదలుపెట్టిన అమిత్ షా.. చంద్రబాబుకు అభివృద్ధి ఎజెండా కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా అని మండిపడ్డారు! బీజేపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్న అమిత్ షా.. ఏపీ రాజధాని కోసం కేంద్రం విడుదల చేసిన నిధుల్లో కేవలం 8శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, పోలవరానికి కేటాయించిన రూ.364 కోట్ల విషయంలో బాబు ప్రభుత్వం ఎలాంటి లెక్కలు సమర్పించలేదని తేల్చేశారు. ప్రజల సొమ్ముకు సంబందించి ప్రతి పైసా లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని బాబుకు సూచించిన ఆయన… 2016-17లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన నిధుల్లో 12 వాతం మాత్రమే రాష్ట్రం ఖర్చు చేసిందని క్లారిటీ ఇచ్చారు.

అంటే… రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు చేయడం రాక కొన్ని నిధులు ఆగిపోతే.. సరైన లెక్కలు చెప్పక మరికొన్ని నిధులు ఆలస్యం అవ్వడం జరిగిందని తేల్చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టరు, పెట్టిన వాటికి సరైన లెక్కలు అందించరు.. కానీ, కేంద్రం మాత్రం ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది చాలా ఉంది అంటారు. ఇస్తామన్న నిధులు అన్నీ ఒకేసారి ఏపీ బ్యాంక్ అకౌంట్స్ లో వేస్తేనే.. కేంద్రం నిధులు ఇచ్చినట్లా.. విడతలవారీగా ఇచ్చిన నిధులు దుర్వినియోగం అవుతున్నప్పుడు కేంద్రాన్ని తప్పుపట్టడం, మీ చేతకాని తనానికి కేంద్రాన్ని బాధ్యులు చేయడం సరైన పద్దతి కాదనే అర్ధం వచ్చేలా అమిత్ షా లేఖలో అక్షర బాణాలు సంధించారు!!

దీంతో… కేంద్రం నుంచి నిధులు రావడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం, ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటల వెనక ఉన్న అసలు విషయం ఇదా అని ఏపీవాసులతో పాటు రాజకీయ విశ్లేషకులు ఒక క్లారిటీకి వస్తున్నారట! ఏది ఏమైనా.. ఈ లేఖ బాబును పూర్తిస్థాయిలో ఇరకాటంలో పాడేసిందనే కామెంట్స్ బలంగా వినిపించడంతోపాటు.. బాబుకు రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు మరింత బలాన్ని చేకూరుస్తుందని అంటున్నారు విశ్లేషకులు!