Home రాజకీయాలు చంద్రబాబు ‘యూటర్న్‌ అంకుల్‌’

చంద్రబాబు ‘యూటర్న్‌ అంకుల్‌’

SHARE

సోషల్‌ మీడియాలో చంద్రబాబు, యూటర్న్‌ అంకుల్‌ అనే పేరు సంపాదించుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బీజేపీతో కలిసి ఉందాం రా.. కలహమెందుకు అని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు చెప్పినట్లుగా చంద్రబాబు అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా మంచిదేనన్నారు. ఢిల్లీలో లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగేళ్లుగా విభజన అంశాలు, ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే.. బీజేపీతో అండస్టాండింగ్‌లో ఉన్నారని చంద్రబాబు, పచ్చ మీడియా కోడై కూసిందని మండిపడ్డారు.

చంద్రబాబు దుర్మార్గాలు అంతా ఇంతా కాదని, ప్రజలను మభ్యపెట్టేందుకు మీడియాను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని వైయస్‌ఆర్‌ సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబు బీజేపీతో మళ్లీ కలిసిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, బాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా.. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టుపెట్టకుండా వాటిని కాపాడితే చాలన్నారు.