Home రాజకీయాలు గాడిద గుడ్డేం కాదు.. కమెడియన్ శివాజీకి ఉండవల్లి కౌంటర్‌

గాడిద గుడ్డేం కాదు.. కమెడియన్ శివాజీకి ఉండవల్లి కౌంటర్‌

SHARE

ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి పాగా వేసేందుకు బీజేపీ ఆపరేషన్ గరుడ మొదలుపెట్టిందని.. అందులో భాగంగా ప్రతిపక్ష నేతపై రెక్కీ నిర్వహించి దాడి చేస్తారని… విధ్వంసం సృష్టిస్తారని.. ఇలా ఉత్కంఠభరితమైన కథను వివరించిన యాక్టర్ శివాజీపై మాజీ ఎంపీ ఉండవల్లి స్పందించారు.

ఇలాంటి కథలు సినిమాలోనే సాధ్యమన్నారు. ఆపరేషన్ గరుడా లేదు.. గాడిద గుడ్డు లేదని తేల్చేశారు. ఎవరో సరదాగా చెప్పిన స్టోరీని శివాజీ సీరియస్‌గా వివరించారని.. ఎందుకో మీడియా కూడా బాగా ప్రచారం కల్పించిందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

శివాజీ శుక్రవారం అవిశ్వాస తీర్మానం ఘట్టం ముగుస్తుందని… నలుగురు తెలుగులో, ముగ్గురు ఇంగ్లీష్‌లో మాట్లాడుతారని అంతటితో అవిశ్వాసం అయిపోతుందని చెప్పారని.. కానీ అలా జరగలేదు కదా అని ఉండవల్లి ప్రశ్నించారు. ఇలాంటి కథలు విని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఇలాంటి ఆపరేషన్లు సినిమాల్లో తప్ప నిజజీవితంలో సాధ్యం కాదన్నారు. ఇవన్ని గండికోట రహస్యం సినిమా కాలం లాంటి జానపద కథలని ఉండవల్లి ఎద్దేవా చేశారు. నాలుగు వేల 800 కోట్లతో ఏదో చేసేస్తారని చెప్పడం సరికాదన్నారు.