Home రాజకీయాలు బాబును వెనుకేసుకొచ్చిన జర్నలిస్ట్‌ను ఉతికేసిన పోసాని…

బాబును వెనుకేసుకొచ్చిన జర్నలిస్ట్‌ను ఉతికేసిన పోసాని…

SHARE

ఆంధ్రప్రదేశ్‌లో కొందరు జర్నలిస్టుల తీరు పదేపదే వివాదాస్పదమవుతూనే ఉంది. పరిధికి మించి చంద్రబాబును వెనుకేకొస్తున్నారన్న భావన ఉంది. పత్రికా జర్నలిస్టులు బయటకు కనిపించరు కాబట్టి వారికి పెద్దగా ఇబ్బంది లేదు.. కానీ టీవీల్లో చర్చలు నిర్వహించే కొందరు సీనియర్ జర్నలిస్టులు మాత్రం తెరపై బాబు భక్తి ప్రదర్శించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా టీవీ5 సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు చంద్రబాబుకు మంచి చేసేలా చేసిన ఒక వ్యాఖ్యతో దర్శకుడు పోసాని చేతిలో విమర్శలు ఎదుర్కొన్నారు.

పోసానితో చర్చ పెట్టిన సాంబశివరావు.. ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడుతుంటే మీ సినిమావాళ్లు మాత్రం షూటింగ్‌లు చేసుకుంటూ ఉంటారా అని పోసానిని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో సినిమావాళ్లు కుమ్మక్కు అయినంతగా మరెవరూ కాలేదంటూ జర్నలిస్ట్‌ సాంబశివరావు విమర్శించారు. దీంతో పోసాని సమాధానం ఇచ్చారు.

”ప్రస్తుతం రైతు తన పని తాను చేసుకుంటున్నారు… బట్టలు కుట్టేవాడు తన పని తాను చేసుకుంటున్నాడు… కుమ్మరివాడు కుండలు తయారు చేసుకుని వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఉద్యోగస్తుడు తన పని తాను చేసుకుంటున్నాడు. మరి మా సినిమా వాళ్లు సినిమా తీసుకుంటే ఇబ్బంది వచ్చిందా?. రాజకీయ పార్టీలు.. ఇప్పటి వరకు ఒకరి చంక ఒకరు నాక్కుని.. మొన్నటి వరకు బీజేపీతో నాక్కుని.. పవన్‌ కల్యాణ్‌తో కలిసి నాక్కుంటూ తిరిగి ఇప్పుడు మీకు కష్టమొచ్చిందని అందరినీ రోడ్ల మీదకు రమ్మంటారా” అని చంద్రబాబును పోసాని ప్రశ్నించారు.

ఇదే చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని గతంలో అన్నారు కదా అని పోసాని ప్రశ్నించారు. దీంతో జర్నలిస్ట్‌ సాంబశివరావు అడ్డుపడ్డారు. ప్రత్యేక హోదా వద్దు అని చంద్రబాబు ఎప్పుడు అన్నారంటూ పోసానిని జర్నలిస్ట్ సాంబశివరావు ప్రశ్నించారు. దీంతో పోసాని దిగ్బ్రాంతి చెందారు. ” చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దన్న విషయం కూడా మీకు తెలియకుపోతే నేను చర్చనుంచి వెళ్లిపోతా. జర్నలిస్ట్‌ గా ఈ విషయం కూడా మీకు స్పృహ లేకపోతే ఇక నేను ఇక్కడ ఉండను. చంద్రబాబు మాట మార్చారంటే అర్థముంది. జర్నలిస్ట్ సాంబశివరావు కూడా మాట మారుస్తాడా.. పోసానిని బఫూన్ చేయడానికి. మీరు ఇదే టాఫిక్ అంటే నేను వెళ్లిపోతా. జర్నలిస్ట్‌గా మీరు నిజాయితీగా మాట్లాడితే ఉంటా. లేదంటే వెళ్లిపోతా. నేనేం బఫూన్ అవడానికి ఇక్కడికిరాలేదు” అంటూ పోసాని ఫైర్ అయ్యారు.

ప్రత్యేక హోదా కోసం గతంలో రోడ్డు మీదకు వచ్చిన వారిని పోలీసులతో చంద్రబాబు ఎందుకొట్టించారని పోసాని ప్రశ్నించారు. పోసాని దూకుడుతో జర్నలిస్ట్ సాంబశివరావుకు కాసేపు చెమటలు పట్టాయి.