Home సినిమా ఆర్‌.. ఆర్‌.. ఆర్‌.. ఈజ్‌ ఆన్‌: జక్కన్న

ఆర్‌.. ఆర్‌.. ఆర్‌.. ఈజ్‌ ఆన్‌: జక్కన్న

SHARE

ఆర్‌ ఆర్‌ ఆర్‌.. ఇంతకీ ఈ ముగ్గురు ‘ఆర్‌’లు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి, రామారావు (ఎన్టీఆర్‌), రామ్‌చరణ్‌. బాహుబలి సినిమా తరువాత లాంగ్‌గ్యాప్‌ తీసుకున్న రాజమౌళి.. రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ ల కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

ఫైనల్లీ ఈ సినిమా గురించి ఓ అఫీషియల్‌  ప్రకటన విడుదల చేశారు. “మాసీవ్‌ మల్టీస్టారర్‌ ఈజ్‌ ఆన్‌, ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఇది టైటిల్‌ మాత్రమే కాదు ది టైటాన్స్‌ కమింగ్‌ టుగెదర్‌’’ అంటూ వీడియోను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో  ఎన్టీఆర్, చరణ్‌.. ఇద్దరూ బాక్సర్స్‌గా, అన్నదమ్ముల పాత్రల్లో కనిపిస్తార ని సమాచారం. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుందట. వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్‌ అవుతుందని సమాచారం.