Home రాజకీయాలు మళ్లీ భారీ యూటర్న్.. రహస్య భేటీతో రచ్చరచ్చ

మళ్లీ భారీ యూటర్న్.. రహస్య భేటీతో రచ్చరచ్చ

7694
SHARE

యూటర్న్  చంద్రబాబు నాయుడు మరోసారి భారీ యూటర్న్‌కు సిద్ధమయ్యారు. బీజేపీతో స్నేహాన్ని తెంచుకున్న తర్వాత ఎదురవుతున్న విషమపరిస్థితులను గమనించిన చంద్రబాబు కేంద్రంతో రాజీకి సిద్ధమయ్యారు.

ఢిల్లీలో తన వ్యవహారాలను పర్యవేక్షించే సుజనాచౌదరిని అరుణ్ జైట్లీ వద్దకు చ ంద్రబాబు పంపించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సుజనా అరున్ జైట్లీని కలిసింది కూడా హోదా కోసం కాదు. ప్యాకేజ్ కోసం. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా గతంలో చెప్పిన ప్రత్యేకప్యాకేజీని ప్రకటించినా తిరిగి బీజేపీ- టీడీపీ మధ్య స్నేహం ఏర్పడుతుందని సుజనా చౌదరి జైట్లీ వద్ద ప్రతిపాదన పెట్టారు.

ఈ భేటీ విషయం ఎంపీలతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్షరెన్స్ సందర్భంగా బయటకు వచ్చింది. తాను అరుణ్ జైట్లీని కలిసినట్టు సుజనా చెప్పారు. దీంతో అక్కడే ఉన్న యనమల సుజనా తీరును తప్పుపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒకవైపు అవిశ్వాసం పెడుతూ.. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలతో ఆందోళనలు చేయిస్తూ మీరు అరుణ్ జైట్లీని కలవడం ఏమిటనిప్రశ్నించారు.

ఇందుకు చంద్రబాబు వెంటనే కవర్ చేసే ప్రయత్నం చేశారు. తనకు తెలియకుండా సుజనా… జైట్లీని కలిశారంటూ బుకాయించారు. సుజనా చౌదరి తన భేటీలో హోదా గురించి అడగలేదు. కేవలం గతంలో ప్రకటించిన ప్యాకేజ్‌పై హామీ ఇస్తే సర్దుబాటు చేసుకుంటామని ఆడిగారు. ఢిల్లీలో చంద్రబాబు ఆత్మలాగా పనిచేస్తున్న సుజనాచౌదరి.. హోదా వద్దు ప్యాకేజ్ చాలు అని జైట్లీని కలిశారంటూ అది చంద్రబాబుకు తెలియకుండా జరిగే పనేనా!. చంద్రబాబు దూతగానే సుజనా.. జైట్లీ వద్దకు వెళ్లారన్నది సుస్పష్టం.

ఊహించని విధంగా యనమల ప్రశ్నించడంతో తనకు తెలియదని చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం మీడియాకు ఎక్కడంతో జైట్లీని కలిసిన సుజనాపై చంద్రబాబు ఆగ్రహం అంటూ అనుకూల మీడియాలో అప్పుడే కథనాలు మొదలెట్టేశారు. మొత్తం మీద వైసీపీ ఎంపీలు ప్రధానిని ఎందుకు కలుస్తున్నారని కాకమ్మ ప్రశ్నలు వేసే చంద్రబాబు.. తన ఆత్మ సుజానాను మాత్రం రహస్యంగా జైట్లీ వద్దకు ఎందుకు పంపారో!. లేదు లేదు చంద్రబాబు ఏమి చేసినా శృంగారమే. ఎన్నిసార్లు మారినా అది పక్కా సంసారమే!.