Home రాజకీయాలు సీబీఐ విచారణకు సిద్ధమా బాబూ?

సీబీఐ విచారణకు సిద్ధమా బాబూ?

SHARE

ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి సవాల్‌ విసిరారు. చంద్రబాబు కంటే అవినీతిపరులు దేశంలో మరెవ్వరు ఉండరని పార్థసారధి విమర్శించారు. దేశంలోనే అవినీతిలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు.

ఈ రోజు రాష్ట్రంలో 16 రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రత్యేక హోదా సాధించాలని బలమైన కాంక్షతో ఉన్న ప్రజలు జాతీయ రహదారుల దిగ్బంధాన్ని విజయవంతం చేశారన్నారు. వారందరికి వైయస్‌ఆర్‌సీపీ ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదా విషయంలో మోసపోయామని బాధతో జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో పాలు పంచుకుంటే చంద్రబాబుకు గుండె మంటగా ఉందన్నారు. దేశంలో అందరికి ఏపీ ప్రజల బాధలు, అసహనం తెలిశాయన్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం ప్రజల ఆకాంక్ష వినిపించడం లేదన్నారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తానుగా సీబీఐ విచారణకు సిద్ధం కావాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేసింది. పోలవరం, పట్టిసీమ, రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ భారీ అవినీతికి పాల్పడినట్లు బీజేపీ, జనసేన చేసిన ఆరోపణలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొంది.

గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఓట్లతో గెలిచిన చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించుకొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని వైఎస్సార్‌ సీపీ నేత సూచించారు. వారం రోజుల్లోగా సీబీఐ విచారణకు ఆదేశించకుంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఒప్పుకున్నట్టే అవుతుందన్నారు.