Home రాజకీయాలు జగన్ కోసం స్టేట్ పోలీసులనే పంపావ్‌.. ఇక వాళ్లు ఎలా వస్తారు…

జగన్ కోసం స్టేట్ పోలీసులనే పంపావ్‌.. ఇక వాళ్లు ఎలా వస్తారు…

9863
SHARE

ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనేందుకు చిత్రపరిశ్రమ ఎందుకు ముందుకు రావడం లేదని టీడీపీ ప్రశ్నించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి స్పందించారు. ప్రతిసారి తమిళనాడు జల్లికట్టు ఉద్యమం తరహాలో సినిమావాళ్లు ముందుకు రావడం లేదని ప్రశ్నించడం సరికాదన్నారు.

తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని ప్రభుత్వమే ముందుండి నడిపించింది కాబట్టి అందరూ ఒక్కటయ్యారన్నారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. గతంలో ప్రత్యేకహోదా కోసం జగన్ విశాఖ వెళ్తే ఎయిర్‌పోర్టులో రన్‌వే పైనే చంద్రబాబు పోలీసులతో అడ్డుకున్నారని గుర్తు చేశారు.ఎయిర్‌పోర్టుల్లోకి స్టేట్‌ పోలీసులను అనుమతించరని.. కానీ అశోక్‌గజపతిరాజును అడ్డుకుపెట్టుకుని ఏకంగా ఎయిర్‌పోర్టులోకి స్టేట్‌ పోలీసులను చంద్రబాబు పంపించారన్నారు.

జగన్‌ విశాఖకు వచ్చేరోజు ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చి… అక్కడి పరిస్థితి తీవ్రతను కేంద్రానికి వివరించి హోదా అడిగింటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. మోడీ బ్లాక్‌మెయిల్ చేస్తుంటే.. చంద్రబాబు ధైర్యంగా ఆ విషయాన్ని ప్రజలకు చెప్పానన్నారు. తన కుమారుడిని జైలుకు పంపుతానని మోడీ బెదిరిస్తున్నారని చంద్రబాబు చెబితే ప్రజలుపరిస్థితిని అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు.

పోలవరం పరిధిలోని ఏఏ గ్రామాల్లో ఎన్ని కోట్ల మేర నేతలు స్వాహా చేశారన్న వివరాలను ఆయన ప్రెస్‌మీట్‌లో చదివి వినిపించారు. పోలవరం జోలికి వస్తే కాలిపోతారని చంద్రబాబు అంటున్నారని.. చూస్తుంటే చంద్రబాబే ఈ పోలవరంలో అక్రమాల ధాటికి కాలిపోయేలా ఉన్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఏ సమస్య లేకుంటే చంద్రబాబు ఇంతగా ఎందుకు భయపడుతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు.