Home రాజకీయాలు టీడీపీ పునాదులకే ఎసరు.. మాకు టచ్‌లో 40 మంది ఎమ్మెల్యేలు..

టీడీపీ పునాదులకే ఎసరు.. మాకు టచ్‌లో 40 మంది ఎమ్మెల్యేలు..

SHARE

జనసేన అధికార ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పిన ఒక విషయం ఇప్పుడు టీడీపీని ఉలికిపడేలా చేస్తోంది. టీడీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు .. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో టచ్‌లో ఉన్నారని వారు మీడియా ముందు చెప్పారు.

ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నది చంద్రబాబుకు కూడా తెలుసని జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్‌ చెప్పారు. 40 మంది ఎమ్మెల్యేల పిల్లలు పవన్‌తో నిత్యం టచ్‌లో ఉన్నారని వివరించారు. పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ఆ ఎమ్మెల్యేల పిల్లలు ప్రైవేట్ సంభాషణల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా చంద్రబాబుకు తెలుసని వివరించారు.

పవన్‌ను కలుస్తున్న ఎమ్మెల్యేలు ఎవరన్నది చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు నివేదిస్తోందన్నారు. టీడీపీ ఎంపీలు కూడా జనసేనకు టచ్‌లో ఉన్నారన్నారు. నారా లోకేష్‌ అవినీతిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని జనసేన అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు.

లోకేష్‌ అవినీతి వ్యవహారాలకు సంబంధించిన వివరాలన్నీ ఢిల్లీ పెద్దల వద్ద ఉన్నాయన్న విషయాన్ని టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారని చెప్పారు. త్వరలోనే లోకేష్ అవినీతికి సంబంధించిన ఆధారాలన్నీ బయటపెడుతామని జనసేన ప్రకటించింది.

మొత్తం మీద ఏకంగా 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పవన్‌ కల్యాణ్‌తో టచ్‌లో ఉన్నారని స్వయంగా జనసేన అధికార ప్రతినిధులు మీడియా ముందే చెప్పడం ఆసక్తికరంగానే ఉంది. ఒకవేళ 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు .. టీడీపీకి గుడ్‌బై చెబితే అది టీడీపీ మూలలనే ప్రశ్నార్థకం చేయవచ్చు.