Home రాజకీయాలు నందమూరి వారిని కదుపుతున్న పోసాని!!

నందమూరి వారిని కదుపుతున్న పోసాని!!

SHARE

పోసాని కృష్ణ మురళి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ జనాలను విమర్శించిన టీడీపీ నేతలను ఏకిపారేసిన ఆయన… కళ్యాణ్ రాం కొత్త సినిమా “ఎం.ఎల్.ఏ – మంచి లక్షణాలున్న అబ్బాయి” సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో టీడీపీ నేతలను విమర్శించడమో, మరొకరిని పొగడటమో చేయకుండా.. నందమూరి వారిని మేల్కొలిపే వ్యాఖ్యలు చేశారనే అనుకోవాలి!

తాజాగా కళ్యాణ్ రాం కొత్త సినిమా “ఎం.ఎల్.ఏ” సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడటం మొదలుపెట్టిన పోసాని కృష్ణమురళి… కళ్యాణ్ రాం వంటి మంచి లక్షణాలున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని కోరారు. చాలా మంది హీరోలు అవుతుంటారు, వేల కోట్లు సంపాదిస్తుంటారు.. కానీ హరికృష్ణ, కళ్యాణ్ రాం లు ఇందుకు భిన్నమని అభిప్రాయపడ్డారు. అందుకోసమే కళ్యాణ్ రాం సక్సెస్ కావాలని.. అంతే కాకుండా తనకు కళ్యాణ్ రాం సినిమాలోకంటే ఎక్కువగా నిజజీవితంలో ఎమ్మెల్యేకావాలని కోరికగా ఉందని ప్రకటించారు.

అంతవరకూ కూడా పెద్దగా ఇబ్బందేముంది అనిపించిందా… అక్కడే ఉంది అసలు విషయం. ఈ అభిప్రాయాలు చెప్పేముందు.. “తెలుగుదేశం పార్టీ మీది.. రామారావుగారి కుటుంబం నుంచి నీలాంటివాడు వస్తే ప్రజలు బాగుపడతారు.. సమాజం బాగుపడుతుంది..” అని సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని. ఈ వ్యాఖ్యలు విన్నవారంతా… తెలుగుదేశం పార్టీ నందమూరి తారకరామారావు ఏర్పాటుచేసిన పార్టీ, ఆయనకు వారసులు లేనట్లు, సరైన వారసులు కొరత ఉన్నట్లుగా అల్లుడి చేతికి పగ్గాలు వెళ్లిపోయాయి. సరే.. హరికృష్ణవల్ల కాలేదు, బాలకృష్ణ వల్ల ఇంక కాదు.. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వారసులైన జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రాం లాంటి వారైనా ఆదిశగా ఆలోచించాలనేది పోసాని అభిప్రాయం అయ్యి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా నందమూరి వారసులను కదుపుతున్నారు అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!!