Home రాజకీయాలు పోసాని మాట: చంద్రబాబు రాజకీయ లోఫర్ బ్రోకర్!!

పోసాని మాట: చంద్రబాబు రాజకీయ లోఫర్ బ్రోకర్!!

486
SHARE

ఏ విషయం మాట్లాడినా తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది.. ఆయన మాటల్లో సన్నాయి నొక్కులకు తావుండదు.. అంతా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యవహారమే.. ఫేస్ టు ఫేస్ ఆ రేంజ్ లో మాట్లాడటం ఆయనకే దక్కిందేమో.. అందుకే అంటారు… విమర్శలందు పోసాని విమర్శలు వేరయా అని! అవును… సినిమా ఇండస్ట్రీపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలపై తనదైన ఫైర్ స్టైల్ లో స్పందించారు పోసాని కృష్ణ మురళి. ఏమాత్రం సన్నాయినొక్కులు లేకుండా, టీడీపీ నేతలను పాయింట్ టు పాయింట్ కడుగుతూ.. ఆ ఫైర్ ఒక రేంజ్ కి వెళ్లిపోయిన తర్వాత బ్రోకర్లు, వ్యభిచారులు అనేశారు కూడా!

వివరాళ్లోకి వెళ్తే… టాలీవుడ్‌ పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోదా కావాల్ని విశాఖలో పోరాడిన సినీ జనాలపై లాఠీచార్జ్ చేసిన ఈ ప్రభుత్వం.. ఉన్నఫలంగా హోదా కావాలని, హోదా గురించి మాట్లాడమని చెప్పడం ఏమిటో అర్ధం కావడం లేదని మొదలుపెట్టిన పోసాని… మీలాంటి రాజకీయ బ్రోకర్లు, రాజకీయ వ్యభిచారుల మాటలు నమ్మి తామంతా పోరాటాలు చేయాలా అని ఫైరయ్యారు!

చంద్రబాబుతో కలిపి టీడీపీ నేతలను మొత్తం ఒక్కగాటికి కట్టినట్లు మాట్లాడిన పోసాని… ఒకసారి వద్దు, ఒకసారి కావాలి అని మాటలు మార్చే జనాలను, రాజకీయ బ్రోకర్లు అని అనక మరేమంటారాని ప్రశ్నిస్తున్నారు. 1972లో జై ఆంధ్ర, జై తెలంగాణ అన్నజనాల్లో ఎందరో పిల్లలు చనిపోయారని, వారిలో ఏ ముఖ్యమంత్రి కొడుకూ, ఏ మంత్రి కొడుకూ పోలేదని సూటిగా చెప్పుకొచ్చారు.

టీడీపీ నేతలు ఎన్ని వెదవ వేషాలు వేసినా జనాలు తన్నులు తినాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించిన పోసాని… 10రోజుల క్రితం ప్రత్యేక హోదా వద్దు అని చంద్రబాబు చెప్పినప్పుడు అంతా నమ్మి, అక్కడే ఉండిపోయామని… ఇప్పుడేమో టీవీళ్లోకి వచ్చి హోదా కావాలి, ఇచ్చితీరాలని బాబు చెబుతుంటే తామెందుకు నమ్మాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇలా మాట్లౌ మార్చేవారిని రాజకీయ బ్రోకర్లు అనక మరేమంటారని ఘాటైన విమర్శలు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలను పార్టీకండువాలు కప్పి నిస్సిగ్గుగా ఫిరాయింపులకు పాల్పడటాన్ని రాజకీయ వ్యభిచారం అనక మరేమంటారు అని ప్రశ్నించారు.

ఇలాంటి పనులు, ఇలాంటి ప్రవర్తన చంద్రబాబుని చూసి సినిమా జనాలు నేర్చుకోవాలా అని టీడీపీ నేతలను సూటిగా సుత్తి లేకుండా తనదైన శైలిలో ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. అయితే బాబూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు సినిమా జనాలు ఇస్తున్న ధీటైన ఘాటైన కౌంటర్లపై టీడీపీ నేతలు సైలంట్ గా ఉండటం కొసమెరుపు!!