Home సినిమా శ్రీమతిగా శ్రియ

శ్రీమతిగా శ్రియ

SHARE

కొన్ని రోజుల క్రితం రష్యన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రీ కోశ్చివ్‌ను ఉదయపూర్‌లో ఆమె వివాహం చేసుకోనున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. సోమవారం ఉదయపూర్‌లో ఆండ్రీ, శ్రియ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒక్కటైపోయారు. అయితే ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు కొన్ని వైరల్‌ అయ్యాయి.

అంతేకాదు శ్రియ వెడ్డింగ్‌ వీడియో ఒకటి ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతోంది. ‘‘ఎవరైతే నిన్ను నిన్నుగా ప్రేమిస్తారో, వారి ప్రేమ నీలో కొంత మంచి మార్పును కోరుకుంటుంది. ఈ మార్పు ప్రేమ కాకపోవచ్చు. రాజీపడటం. శ్రియ ప్రేమ ప్రతిరోజూ నన్ను కొత్తగా, బెటర్‌గా ఉంచుతుందన్న నమ్మకం ఉంది’’ అని ఆండ్రీ కోశ్చివ్‌ అన్నట్లుగా ఈ వీడియాలో ఉంది. భర్త మాట్లాడుతున్న సమయంలో శ్రియ ప్రేమగా అతన్ని ముద్దాడటం హైలైట్‌. ఇదిలా ఉంటే ఈ జంట ఈ నెల 12న ముంబైలో తమ వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకున్నారని టాక్‌.