Home రాజకీయాలు జగన్ కేసులపై ఉండవల్లి క్లారిటీ!

జగన్ కేసులపై ఉండవల్లి క్లారిటీ!

SHARE

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు బిజినెస్ చేయకూడదా..? అలాంటి రూల్స్ ఏమీ లేవు కదా..! అలా చేసి, తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారికి రసీదులు ఇచ్చి, షేర్లు ఇచ్చిన వ్యక్తి వ్యవహారం క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది..? నిజాయితీగా రసీదులు ఇవ్వడమే జగన్ పై కేసులకు ప్రధాన కారణం!! ఈ మాటలన్నీ మాట్లాడింది ఉండవల్లి అరుణ్ కుమార్! జగన్ పై ఉన్న కేసులు, టీడీపీ నేతలు చేస్తున్న లక్ష కోట్ల అవినీతిపై తాజాగా ఉండవల్లి తనదైన శైలిలో స్పందించారు!

ఏ విషయంపై అయినా వీలైనంత అర్ధం అయ్యేలా, సామాన్యుడికి సైతం సులువుగా అర్ధం అయ్యేలా స్పష్టం, వివరంగా మాట్లాడతారు అనే పేరున్న రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా జగన్ కేసుల విషయంపై స్పందించారు! ఉదయం లేచినప్పటినుంచి జగన్ లక్ష కోట్లు తిన్నారని టీడీపీ నేతలు చేసే ప్రచారాలు తప్పుడువి అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఉండవల్లి! జగన్ పై పెట్టిన మొత్తం 13 ఛార్జిషీట్ల విలువ రూ.1300 కోట్లు కాగా.. వాటిలో రూ.500 కోట్లకు సంబందించిన కేసులు క్లియర్ అయిపోయాయి. ఇక మిగిలింది రూ.800 కోట్ల విలువైన కేసుల సంగతులు మాత్రమే!! మరి ఇక్కడ ఉన్న రూ.800 కోట్లకు టీడీపీ నేతలు చెబుతున్న లక్ష కోట్లకు సంబందం ఏమైనా ఉందా? అనేది ఉండవల్లి ప్రశ్నగా ఉంది!

ఇదే విషయాలపై తనదైన క్లారిటీ ఇచ్చిన ఉండవల్లి… తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వ్యాపారాలు చేయకూడదని రూలేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే క్రమంలో జగన్ ని నమ్మి పెట్టింది పెట్టుబడి అని చెప్పిన ఆయన అదే లంచం అయితే దానికి రసీదు ఇస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. కానీ… ఇది లంచం కాదు, క్విడ్ ప్రోకో కాదు కనుకనే జగన్ వారికి క్లియర్ గా రసీదులు ఇచ్చారని… ఆ రసీదులు ఇవ్వడం వల్లే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుపోయాడని చెప్పుకొచ్చారు. అంటే… బల్ల కింద నుంచి లంచాలు తీసుకున్న సొమ్ము కాదు, పూర్తిగా రసీదులు ఇచ్చి మరీ తీసుకున్న సొమ్ము అనేది ఉండవల్లి మాటల అర్ధంగా ఉంది! ఏది ఏమైనా… ఈ విషయాలపై తాజాగా ఉండవల్లి ఇచ్చిన క్లారిటీ ప్రజలకు సరైన క్లారిటీ ఇచ్చే దిశగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు!!