Home రాజకీయాలు సభలో ఏం జరిగింది? ..టీడీపీ బట్టలూడదీసిన నేషనల్ మీడియా…

సభలో ఏం జరిగింది? ..టీడీపీ బట్టలూడదీసిన నేషనల్ మీడియా…

SHARE

చంద్రబాబు ప్రత్యేక హోదానే కావాలంటూ యూ టర్న్ తీసుకున్న తర్వాత తెలుగు టీవీ చానళ్లు, పత్రికలు వేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. మోడీపై చంద్రబాబు అవిశ్వాసంతో కేంద్రం వణికిపోతోంది అంటూ కథనాలు రాస్తున్నాయి.

వైసీపీ అవిశ్వాసతీర్మానానికి ఇతర పార్టీల నుంచి పెద్దగా మద్దతు రాలేదని.. అదే టీడీపీ అవిశ్వాసానికి వెల్లువగా మద్దతు వస్తోందంటూ నమ్మిస్తున్నాయి. అయితే లోక్‌సభలో అవిశ్వాసం సందర్భంగా టీడీపీ ఎంపీల నిజ స్వరూపం ఏంటో.. ఆ సమయంలో వారు ఏం చేశారో ఏపీలోని జాతి మీడియా చూపించకపోయినా.. జాతీయ మీడియా మాత్రం బట్టలూడదీసి చూపించింది.

అవిశ్వాసతీర్మానం చర్చకు రాకుండా టీఆర్‌ఎస్, అన్నా డీఎంకే సభ్యులు అడ్డుకుంటున్నారని ఇక్కడి మీడియా ప్రచారం చేస్తూ వస్తోంది. కానీ అవిశ్వాసతీర్మానాన్ని స్పీకర్ చేపట్టిన సమయంలో సభను అడ్డుకున్నది స్వయంగా టీడీపీ ఎంపీలే. ఈ విషయాన్ని జాతీయ టీవీ చానళ్లు వీడియో సాక్ష్యాలతో సహా ప్రసారం చేశాయి.

టీడీపీ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. ఒకవైపు మోడీపై అవిశ్వాసం అంటూ బయట హడావుడి చేస్తూ.. లోపల సభలో మాత్రం అవిశ్వాస తీర్మాన సమయంలో అది చర్చకు రాకుండా టీడీపీ ఎంపీలే ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ వద్ద ఆందోళన చేస్తున్న దృశ్యాలను జాతీయ మీడియా చానళ్లు ప్రసారం చేశాయి.

అవిశ్వాసం అంటూనే సభలో టీడీపీ ఎంపీలు ఎందుకు రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదని టైమ్స్ నౌ వ్యాఖ్యానించింది. టీడీపీ ఎంపీలు ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించింది. చంద్రబాబుకే కాన్ఫిడెన్స్ లేదన్న అర్థం వచ్చేలా జాతీయ మీడియా వ్యాఖ్యలు చేసింది. అవిశ్వాసం కావాలంటూనే… మరోవైపు టీడీపీ ఎంపీలు ఆందోళన చేయడం ఏమిటని నిలదీసింది.

స్పీకర్ అవిశ్వాస తీర్మానాలు చదువుతున్న సమయంలో కామ్‌గా ఉండాల్సిన టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో ఆమెకు అడ్డుగా నిలబడిన దృశ్యాలను కూడా జాతీయ మీడియా ప్రసారం చేసింది. మొత్తం మీద అవిశ్వాసం విషయంలోనూ టీడీపీ ఆడిన డ్రామాను ఏపీలోని జాతిమీడియా రక్తికట్టించినా.. జాతీయ మీడియా మాత్రం బట్టలూడదీసి చూపించింది.