Home రాజకీయాలు రియల్ హీరోగా మారే ఛాన్స్ వచ్చింది పవన్!

రియల్ హీరోగా మారే ఛాన్స్ వచ్చింది పవన్!

SHARE

రీల్ హీరోలు సరే.. మరి రియల్ హీరోలుగా మారాలంటే..? రాజకీయాలకు సంబందం లేకుండా ఊహించని రీతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆ అవకాశం లభించింది అనే కామెంట్స్ తాజాగా వినిపిస్తున్నాయి. దానికి కారణం తాజాగా జాతీయ మీడియాతో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్! అవును.. ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ అవినీతిపై పవన్ చేసిన కామెంట్స్ పై తాజాగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ కామెంట్స్ పై ఇప్పటికే టీడీపీ నేతలు పోటీలుపడి మరీ పవన్ పై విమర్శలు చేసేస్తున్నారు.

తాజాగా ఈ కామెంట్స్ పై నారా లోకేష్ కూడా స్పందించకపోతే బాగోదు అన్నట్లు స్పందించాడు. పవన్ దుమ్మెత్తి పోస్తే తాము దులుపుకోవాలా అని తనమార్కు తెలివితేటలతో కూడిన కౌంటర్ ఇచ్చారు లోకేష్. దుమ్మెత్తినప్పుడు దులుపుకోవాలి కదా.. లేదా వేసిన వారిని ఎందుకు వేశావని ప్రశ్నించాలి.. అనే కౌంటర్స్ వేస్తున్నారు నెటిజన్లు! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడిన పవన్.. లోకేశ్‌ అవినీతి వ్యవహారంపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌ పై తాను చేసిన వ్యాఖ్యలకు తనవద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతూ.. ఏ ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడుతానని ఎదురు ప్రశ్నించారు. అదేవిదంగా.. సరైన సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతానని వెల్లడించారు.

నిజంగా పవన్ రియల్ హీరో అయితే.. ఆధారాలు దగ్గరపెట్టుకుని కూడా బయటపెట్టడానికి సరైన సమయం అంటూ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే తప్ప.. ఏదో చేస్తాను, అందరికంటే భిన్నం అని చెప్పే మాటలకు పవన్ చేసే చేష్టలకు పొంతన లేదని అంటున్నారు. అలా కాకుండా… నిజంగా లోకేష్ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే… వెంటనే అవి భయటపెట్టి, రియల్ హీరో అనిపించుకోవాలని.. తద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వారవుతారని పలువురు పవన్ కు సూచిస్తున్నారు.

మరి ఈ సూచనలను పరిగణలోకి తీసుకుని, లోకేష్ అవినీతికి సంబందించి తనవద్ద ఉన్న ఆధారాలు బయటపెట్టి రియల్ హీరో అనిపించుకుంటారా… లేక డైలాగులకే పరిమితమై సినిమా హీరోగానే మిగిలిపోతారా అనేది వేచి చూడాలి!!