Home రాజకీయాలు గదుల్లో కులకడాలు.. బొడ్డు వర్ణించడాలు..

గదుల్లో కులకడాలు.. బొడ్డు వర్ణించడాలు..

SHARE

టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేందప్రసాద్ చిత్రపరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం ప్రత్యేక హోదా కోసం పోరాడితే జైలుకు పంపుతామని చెప్పిన పార్టీ నేతలే.. ఇప్పుడు హోదా కోసం ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

మీడియాతో మాట్లాడిన బాబు రాజేందప్రసాద్.. చిత్రపరిశ్రమకుచెందిన హీరోలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ల వెంటపడడం తప్ప దేనికి పనికిరారని వ్యాఖ్యానించారు.

హీరోలకు కళ్లుకనిపించడం లేదా అనిప్రశ్నించారు. ఏసీ రూముల్లో కులుకుతూ ఉన్నారా అని వ్యాఖ్యానించారు. మాయరోగం ఏమైనా వచ్చిందా అన్నారు. హీరోలకు చావ చచ్చిందా అని ప్రశ్నించారు. మేం టికెట్ల రూపంలో ఇచ్చే వందల కోట్లు తీసుకుని ఆ మత్తులో మునుగుతున్నారా అని ప్రశ్నించారు.

ఇప్పటికైనా బాబుకు అండగా రాష్ట్రం కోసం పోరాటం చేయకపోతే వెలివేస్తామని చిత్రపరిశ్రమను హెచ్చరించారు. అవార్డులు రాకపోతే యాగి చేసే వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. హీరోయిన్‌ వెంటపడే క్యారక్టర్లు చేయడానికి మాత్రమే పనికొస్తారా అని హీరోలను ప్రశ్నించారు.

ఏజ్‌ బార్‌ అయిన నటులకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదా అని ప్రశ్నించారు. డైరెక్టర్లు కేవలం హీరోయిన్‌ బొడ్డు, జగణాల గురించి వర్ణించడానికి తప్ప దేనికి పనికి రారు అని రాజేంద్రప్రసాద్ అవహేళన చేశారు. హీరోయిన్‌ వెంటపడే క్యారక్టర్లు చేయడానికి మాత్రమే హీరోలు పనికొస్తారని ఎద్దేవా చేశారు.