Home రాజకీయాలు టీడీపీకి వైకాపా అంటే ఎంత భయమో చెప్తున్నారు!

టీడీపీకి వైకాపా అంటే ఎంత భయమో చెప్తున్నారు!

7648
SHARE

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంతో అన్యోన్యంగా కలిసున్న పార్టీలు బీజేపీ – టీడీపీ! అనంతరం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి జరుగుతున్న లాభ నష్టాల సంగతి పక్కనపెట్టి అధికారం పంచుకున్న పార్టీలు ఆ రెండూ! ప్రత్యేక హోదా అనే విషయంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టి మరీ బీజేపీతో స్నేహంగా ఉన్న పార్టీ టీడీపీ. సుమారు నాలుగు సంవత్సరాలు రాష్ట్ర ప్రయోజనాల విషయం లైట్ తీసుకుని కేంద్రం విషయంలో సన్నాయి నొక్కులు నొక్కిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీ లైట్ తీసుకున్న ప్రత్యేక హోదా అనే విషయంలో కోసం తాజాగా ఇంత హడావిడి ఎందుకు చేస్తుంది. బీజేపీతో కటీఫ్ చేసుకునేటంత ప్రేమ రాష్ట్రంపై ఉందా? హోదా ఇవ్వలేమని కేంద్రం ఇప్పుడు కొత్తగా అనలేదే.. ఇప్పటికి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పారు. మరి అప్పుడు రాని కోపం, కలగని బాద, ఇప్పుడు సడన్ గా రాత్రికి రాత్రే ఏకంగా అవిశ్వాసం పెట్టేస్థాయిలో ఎందుకు వచ్చింది? దీనికంతటికీ గల అసలు కారణం ఇదేనంటు చెబుతున్నారు బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్!

తాజాగా టీడీపీ.. బీజేపీని ఎందుకు కాదనుకుంది అనే విషయంపై రవిశంకర్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో చంద్రబాబుకి ఎలాంటి సమస్యా లేదు. అని మొదలుపెట్టిన ఆయన… ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న విషయంలో బీజేపీ ఇప్పటికీ క్లియర్ గానే ఉందని నొక్కి వక్కనించారు. హోదా సాధ్యం కాని నేపథ్యంలోనే కేంద్రం ప్యాకేజీని ప్రతిపాదించింది అని స్పష్టం చేశారు. అనంతరం చంద్రబాబుకు అసలు సమస్య వైసీపీనే.. వైసీపీకి భయపడి టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావడం దురదృష్టకరం.. అని రవిశంకర్ చాలా క్లియర్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రసాద్ చెప్పిన విషయాలను సరిగ్గా గమనిస్తే.. బీజేపీ హోదా ఇవ్వలేదనో, రాష్ట్రానికి అవసరమైన నిధులు అందించలేదనో మరో కారణమో, ఏ కారణమో అసలు కారణం కాదని… కేవలం ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు తీవ్రతరం చేస్తుందని, ప్రజలు పూర్తిగా వైకాపా పోరాటంపై నమ్మకం పెడుతున్నారని బయపడి మాత్రమే బీజేపీతో కటీఫ్ చెప్పి.. తాను కూడా తీవ్రంగానే పోరాడుతున్నాను అనే సంకేతాలు రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశ్యమే తప్ప.. బీజేపీతో బాబుకు వచ్చిన సమస్యలు ఏమీ లేవని అర్ధం అవుతుంది. ఈ విషయాలను బీజేపీ నేతలు ఇంతక్లారిటీగా చెప్పడం నిజంగా సంచలనమే. అయితే.. ఈ మాటలు బాబును రాజకీయంగా కూడా చాలా డ్యామేజ్ చేసే మాటలు కావడం గమనార్హం. ఏది ఏమైనా… బాబు హోదా పోరాటం వెనక అసలు కారణం బీజేపీ నేతలు తమదైన శైలిలో చెప్పడం ప్రజలకు క్లారిటీ ఇచ్చినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!!