Home రాజకీయాలు ఆ విషయంలో బాబును మించినవారు లేరట!!

ఆ విషయంలో బాబును మించినవారు లేరట!!

SHARE

గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వరుసపెట్టి బీజేపీ పై విమర్శల వర్షాలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అధినేత చంద్రబాబు అయితే అటు అసెంబ్లీలోనూ, ఇటు మండలిలోనూ, వీడియో కాన్ఫరెన్స్ లలోనూ మోడీని, బీజేపీని వరుసపెట్టి నిప్పుల వర్షాలు కురిపించేస్తున్నారు. ఈ దైర్యానికి కారణం బాబుకి వైకాపా అంటే ఉన్న భయమే అని రవిశంకర్ ప్రసాద్ లాంటి బీజేపీ సీనియర్ నేతలు క్లారిటీ ఇస్తుంటే.. మరో బీజేపీ నేత రామ్ మాధవ్ మాత్రం నేరుగా బాబుపై విమర్శల వర్షాలు కురిపించారు. ప్రతిపక్షాలు బాబుని ఏ రేంజ్ లో విమర్శిస్తాయో ఆ రేంజ్ లో రామ్ మాధవ్ ఫైరయ్యారు.

గత కొన్ని రోజులుగా టీడీపీపై జనసేన అధినేత పవన్ చేస్తున్న విమర్శలకు కారణం బీజేపీ నే అని, ఢిల్లీ పెద్దలు వెనకుండి పవన్తో తమను తిట్టిస్తున్నారని బాబు ఆరోపించిన విషయంపై స్పందించారు మాధవ్. రాజకీయ డ్రామాలు అనే విషయానికి వస్తే ఎక్కువగా అలాంటివి చేసింది ఆ పార్టీయే అని మొదలుపెట్టి… రాజకీయ జిమ్మిక్కులకు చంద్రబాబు పేరుగాంచారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇంతకాలం కలిసుండటం వల్ల తెలుసుకున్నారో ఏమో తెలియదు కానీ… రాజకీయ క్రీడలో చంద్రబాబును మించిన వారు లేరని, టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం అతా కేవలం రాజకీయం అని మాధవ్ అన్నారు. నిన్నమొన్నటిదాకా తమతోనే కలిసి సాగిన టీడీపీ.. హఠాత్తుగా సెంటిమెంట్ ఇష్యూని తెరపైకి ఎందుకు తీసుకు వచ్చిందో చెప్పాలని. అదేవిదంగా ఈ అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతున్నారో ఏపీ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని రామ్ మాధవ్ డిమాండ్ చేశారు.

ఏది ఏమైనా… మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశారని, నిధులు ఇవ్వలేదని విమర్శిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం ఒకడుగు ముందుకు వేసి బాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే.. బాబు విషయంలో బీజేపీ నేతలు ఇంక ఫుల్ రేంజ్ లో దూసుకుపోతారని తెలుస్తుంది. అయితే… బాబుపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు కేవలం మాటలవరకే మిగిలిపోతాయా లేక చేతల వరకూ చేరతాయా అనేది పలువురి సందేహంగా ఉంది!!