Home రాజకీయాలు ఏమిటి సంగతి పవన్.. సౌండ్ మారింది!

ఏమిటి సంగతి పవన్.. సౌండ్ మారింది!

1919
SHARE

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పోరాటం విషయం మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే! పవన్ పోరాటంలో వాస్తవం ఎంత.. పవన్ మాటల్లో నిజాయితీ ఎంత.. మిగిలిన విషయాల సంగతి కాసేపు పక్కన పెడితే.. ప్రత్యేక హోదా విషయంలో పవన్ చెబుతున్న ఏమాట ఫైనల్.. ఏ మాటను జనాలు కన్ఫాం చేసుకోవాలి.. తాజాగా పవన్ మాటలను విన్నవారికి ఇవే సందేహాలు పుట్టుకొస్తుంటే.. మరి కొందరికి మాత్రం పవన్ పోరాటంపై ఉన్న అనుమానంపై క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు.

విషయానికొస్తే.. తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గతంలో వైకాపాపై విమర్శల వర్షాలు కురిపించిన పవన్.. నిన్న టీడీపీపైనా, తాజాగా బీజేపీపైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయ విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని గట్టిగా మాట్లాడిన విషయంపైనే ప్రస్తుతం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నమొన్నటివరకూ ప్రత్యేక హోదా కచ్చితంగా కావాలని, ప్రత్యేక ప్యాకేజీ అనేది పాచిపోయిన లడ్డు అని, ఈ విషయంలో కేంద్రం చేస్తుంది తప్పని కాస్త గట్టిగానే మాట్లాడిన పవన్ తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం కాస్త నాలుక మడతపెట్టారనే చెప్పాలి.

ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా.. పేరేదైనా.. రాష్ట్రానికి ఆర్ధిక సహాయం అవసరం అని తాజాగా స్పందించారు పవన్! నిన్నటివరకూ ఏపీ దశ మారాలంటే హోదా తప్పనిసరి అన్న వ్యక్తే.. నేడు పేరు ఏదైనా పర్లేదు సాయం చాలు అని మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. హోదా విషయంలో పవన్ యూ టర్న్ తీసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. గతంలో ఇదే విషయాన్ని, ఇదే అభిప్రాయాన్ని బాబు వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. ఆ నిరక్ష్యం, ఆ అనాలోచిత నిర్ణయమే నేడు ఈ పరిస్థితికి కారణం అనే విమర్శలు బాబుకు నిత్యం తప్పని సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలం తర్వాత, ఏపీకి ప్రత్యేక హోదా పోరాటాన్ని వైకాపా తీవ్రతరం చేసిన తర్వాత కూడా పవన్ ఇలాంటి మాటలే మాట్లాడటంపై జనసేన పోరాటం నిజాయితీది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు!!