Home రాజకీయాలు చంద్రబాబుకు ఎన్ని నాలుకలు..!?

చంద్రబాబుకు ఎన్ని నాలుకలు..!?

3156
SHARE

దేవుడు నోరిచ్చాడు కదా అని, నాలుకకు నరం లేదని ఏదైనా మాట్లాడొచ్చని మాట్లాడుతుంటారు కొంతమంది జనాలు. అయ్యో.. మన మాటలు వింటున్న జనాలు ఏమనుకుంటారు, నవ్వుకుంటారేమో, తిట్టుకుంటారేమో అని ఏమాత్రం బెరుకు ఉండదు. ఈ విషయంలో, ఇలాంటి మాటల విషయంలో తనకున్న ప్రత్యేకతను నిత్యం కాపాడుకుంటూ వస్తుంటారు చంద్రబాబు. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్ ఇంకెవరికైనా వచ్చేస్తుందేమో అనే భయమో ఏమో కానీ.. ఆ స్థానాన్ని మాత్రం పదిలంగా కాపాడుకుంటున్నారు. తాజాగా బీజేపీ, జనసేనలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాబు విధానాలను మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

గతంలో బీజేపీతో పొత్తు తాముచేసిన చారిత్రక తప్పిదం అని వ్యాఖ్యానించిన బాబు.. అనంతరం, రకరకాలా ప్రయత్నాలు చేసిన మోడీగాలి వీస్తుందని చెప్పి కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఆ స్థాయిలో విమర్శలు చేసిన తర్వాత కలుపుకున్న వాళ్లు ఎలా కలుపుకున్నారు, కలిసినవాళ్లు మాత్రం ఎలా కలిశారు అనే విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం! ఇదే క్రమంలో సినీనటుడైన పవన్ ఇంటికి స్వయంగా వెళ్లి.. మద్దతు అడిగి ప్రచారం చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అటు మోడీని, ఇటు పవన్ ని ఊకదంపుడు ఉపన్యాశాలతో పొగిడి పొగిడి ఆకాశానికెత్తిన చంద్రబాబు… తాజాగా మాట మార్చారు!!

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ, పవన్ ల వల్ల తమకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదని, ఇంకా గట్టిగా మాట్లాడితే… వారివల్ల టీడీపీకి కాస్త నష్టమే జరిగిందనే రేంజ్ లో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏరు దాటాక తెప్పతేలయడం అనే సామెత కాసేపు గుర్తొచ్చినా.. ఈ విషయంలో బాబుని మించినవారిని చూడగలమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు!! మరీ దారుణం కాకపోతే.. నిన్న మొన్నటివరకూ వాళ్లంత తోపులు లేరని చెప్పి ఇప్పుడేమో వాళ్ల వల్ల తాను నష్టపోయాను.. వాళ్లు విడిపోవడం మంచిదే అనేఅర్థం వచ్చేలా మాట్లాడటం బాబుకు మాత్రమే సొంతం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి!!